గ్యాంగ్ స్టర్ నయీంను కాల్చిచంపిన పోలీసులు.!?

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ నేర చరిత్ర చాలా పెద్దదే. ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలం రేపిన సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసుతో పాటు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మావోయిస్టు నేతలు సాంబశివుడు, రాములు హత్య కేసుల్లోనూ నయీమ్ కీలక నిందితుడు. భూదందాలు, సెటిల్ మెంట్లతో తనదైన శైలిలో కరడుగట్టిన నేరగాడిగా పేరుగాంచిన నయీమ్ పై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు అతడిని వేటాడేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ బలగాలు కొద్దిసేపటి క్రితం షాద్ నగర్ లో అతడిని అంతమొందించాయి. మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీమ్ పై ఇప్పటికి  100కు పైగా కేసులున్నాయి.

13942566_822189977880875_208600422_n

 

గత  కొద్దికాలంగా నయూమ్ కదలికపై నిఘా వేసిన స్పెషల్ బృందాలు, నయీం  షాద్ నగర్ లో ఉన్నాడని తెలియగానే అతనిని చుట్టుముట్టాయి. ..ఇది గమనించిన నయూమ్ బాడీగాడ్స్ పోలీసులపై కాల్పులు జరపగానే పోలీసులు  ఎదురుదాడి చేశారు. ఈ ఘటనలో  నయీం హతమయ్యాడని తెలంగాణ రాష్ట్ర DGP అనురాగ్ శర్మ వెల్లడించారు.

13933175_822196041213602_1358449454_n

13936987_822039211229285_1364565500_n

Comments

comments

Share this post

scroll to top