గాంధీ స్కూల్ లైఫ్ ఏంటి? జాతిపిత టాప్ ర్యాంక‌రా.? గాంధీజీ….మార్క్స్ మెమో.!

స‌త్యం- అహింసల‌నే ఆయుధాలుగా మ‌లిచి….దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన‌… మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ స్కూల్ లైఫ్ ఏంటి? జాతిపిత టాప్ ర్యాంక‌రా.? అప్ప‌టి నుండే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు మెండుగా ఉండేవా? తోటి విద్యార్థుల‌తో ఎలా ఉండేవాడు., క‌ర‌మ్ చంద్ కు ఏ ఆట అంటే ఇష్టం….? ఇలాంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను రాజ్ కోట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ JM ఉపాధ్యాయ ‘Mahatma Gandhi as a Student’ అనే బుక్ లో రాశాడు.

గాంధీ….త‌ర‌చూ స్కూల్స్ మారుతూనే ఉండేవాడు.ఒక్క రాజ్ కోట్ హైస్కూల్ లో మాత్రం 7 సంవ‌త్స‌రాలు చ‌దుకున్నాడు.

గాంధీ డుమ్మాల మాస్టార్… ప్రాథ‌మిక విద్యను అభ్య‌సించే క్ర‌మంలో 235 రోజులు స్కూల్ న‌డిస్తే గాంధీ అటెండ్ అయ్యింది 110 రోజులే.

ఇక మార్కుల విష‌యానికొస్తే …. 45-55 శాతం మ‌ధ్య‌లోనే..దీనిని బ‌ట్టి గాంధీ స్ట‌డీస్ లో యావ‌రేజ్ స్టూడెంట్ యే అని చెప్ప‌వొచ్చు.!

బొంబాయ్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన మెట్రిక్యులేష‌న్ ప‌రీక్ష‌లో మాత్రం గాంధీ 404 వ ర్యాంక్ ను సాధించాడు. మొత్తం 3,067 విద్యార్థులు ఈ ప‌రీక్ష రాయ‌గ అందులో….799 మందే అర్హ‌త సాధించారు..అందులో గాందీ ర్యాంక్ 404.

గాంధీజీకి చిన్నపుడు క్రికెట్ అంటే చాల ఇష్టం.తన పాఠశాల మిత్రుడు మోహతాబ్ తో కలసి ఇద్దరు క్రికెట్ ఆడేవారు..!

Comments

comments

Share this post

scroll to top