ఇది క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ నాటిన మొక్క.

అది 1942 ఆగస్ట్ మాసం…. క్విట్ ఇండియా అంటూ ఓ సరికొత్త ఉద్యమానికి తెరతీశారు మహాత్మాగాంధీ గారు.  రెండవ ప్రపంచ యుద్దంలో మాకు సహాయం చేస్తే మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తామని నోటి మాటగా చెప్పిన బ్రిటీష్ అధికారుల కొమ్ములను వంచడానికి చేపట్టిన మహా ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమంలో డూ ఆర్ డై అనే నినాదాన్ని తీసుకొని మహాత్మాగాంధీ దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రతి ఒక్కరినీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యులుగా చేసేందుకు అనేక ప్రసంగాలు చేశారు.

ఈ ఉద్యమంలో భాగంగానే…గాంధీ మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా దూసి అనే ప్రాంతానికి వచ్చారు. ఆ సంధర్భంగా గాంధీ నాటిన మొక్కే ఇప్పుడు ఫోటో కనిపించేది.  అప్పటి మొక్క ఇప్పుడు మహావృక్షంగా మారి అదే ఆ గ్రామానికి ఓ గుర్తుగా మిగిలింది.

#ఈనాడు దినపత్రిక సౌజన్యంతో.

 

20160720a_014135010

Comments

comments

Share this post

scroll to top