బయట పడ్డ కాకతీయుల కాలంలోని గణపతి దేవాలయం.

వరంగల్ జిల్లాకు చెందిన గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన గణపతి ఆలయం వెలుగు లో వచ్చింది . గత పురావస్తు శాఖ పుస్తకాల్లో చదివిన ఆధారాలతో గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, పర్యాటక కోర్సు పూర్వ విద్యార్థి మదిగొండ శ్రీనివాస్ కలిసి గ్రామానికి మైలు దూరంలో భోగంమాటు వాగుకు దక్షిణ దిక్కులోని చిన్నగుట్టల్లో గణపతి ఆలయ శిల్పాలను, స్తంభాలను గుర్తించారు.అలాగే ఆ గుట్టలో కాకతీయులు, వారి సామంతులు శిలాశాసనాలపై చెక్కిన సూర్య చంద్రుల బొమ్మలను గుర్తించారు. యుద్ధాల సమయంలో కత్తులను పదును పెట్టేందుకువాడే సహజమైన రాయిని కనుగొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ రాజులు ఈ రాయిపైనే కత్తులను పదును పెట్టేవారని పుస్తకాల్లో ఉన్నట్లు తెలిపారు.

11048265_861808877267438_3165643141577777308_n

12274238_861197920661867_9218116368316601984_n

Comments

comments

Share this post

scroll to top