ప్రపంచంలోనే ఇలాంటి ఆక్సిడెంట్ తొలిసారి..గాల్లోకి పల్టీలు కొట్టి భవనం రెండో అంతస్తులో కారు! [VIDEO]

రోడ్లపై వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని వాహనాలను నడపాలి. లేదంటే ప్రమాదాల బారిన పడడం తథ్యం. ఇక నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కు తోడు, వేగం, మద్యం తాగడం వంటి అంశాలు తోడైతే ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. నేటి తరుణంలో మనం చాలా ఘటనలను ఇలాంటివి చూస్తున్నాం. ఎక్కువగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ యాక్సిడెంట్లే జరుగుతున్నాయి. అయితే అందుకు మన నగరాలు, పట్టణాలే కాదు, విదేశాలు కూడా వేదికలవుతున్నాయి. అక్కడ కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అందరినీ షాక్‌కు గురి చేసింది.

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ రహదారిపై మితిమీరిన వేగంతో ఇద్దరు వ్యక్తులు కారును నడిపారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పింది. అది గాల్లో పల్టీలు కొట్టింది. అలా కారు పల్టీలు కొడుతూ గాల్లోకి లేచి పక్కనే ఉన్న ఓ కార్యాలయంలోని రెండో అంతస్తులోకి దూసుకెళ్లింది. అనంతరం ఆ బిల్డింగ్‌ కిటికీలో కారు అలాగే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాదంలో ఓ వ్యక్తి వెంటనే తప్పించుకోగా మరో వ్యక్తి కారులోనే చిక్కుకున్నాడు. దీంతో రెస్‌క్యూ టీం వచ్చి అతన్ని రక్షించింది. అనంతరం వారు కారును క్రేన్‌ సహాయంతో కిందకు దించారు. అందుకు వారికి 2 గంటలకు పైగానే సమయం పట్టింది. అయితే ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు మాత్రమే అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా ఆ ఇద్దరూ డ్రగ్స్‌ తీసుకుని ఆ మత్తులో కారును అలా వేగంగా నడిపారని పోలీసులు చెప్పారు. ఏది ఏమైనా.. మత్తులో వాహనం నడిపితే ఇలాగే జరుగుతుంది. అదృష్టవశాత్తూ ఆ ఇద్దరికీ ఏమీ కాలేదు, కాబట్టి బతికిపోయారు. కానీ ఈ యాక్సిడెంట్‌ అయిన తీరును చూస్తే అసలు ఈపాటికే ఆ ఇద్దరికీ నూకలు చెల్లిపోయి ఉండేవి. ఏది ఏమైనా ఇలా మాత్రం ఎవరూ వాహనాలను నడపకండి. లేదంటే ప్రాణాల మీదకే వస్తుంది జాగ్రత్త..!

Comments

comments

Share this post

scroll to top