హెల్మెట్ పై కొత్త రూల్స్..! తెలుస్తే షాక్ అవుతారు..!

ద్విచక్ర వాహనాలను నడిపే వారికి హెల్మెట్‌ పెట్టుకోవడం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. హెల్మెట్‌ వల్ల తలకు గాయం కాకుండా ఉంటుంది. తీవ్రమైన యాక్సిడెంట్‌ అయినా తలకు హెల్మెట్‌ ఉంటే ప్రాణాలతో బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కొందరు హెల్మెట్‌లను వాడరు. అయితే అలాంటి వారికి ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లను విధిస్తుంటారు. కానీ ఇకపై.. వారే కాదు… గల్లీల్లో హెల్మెట్‌ లేకుండా తిరిగే వారిపై కూడా ట్రాఫిక్ పోలీసులు చలాన్‌ విధించనున్నారు. అవును, మీరు విన్నది నిజమే.

బాగా ఎక్కువ దూరం వెళ్లడం లేదు కదా.. పక్కకే గా.. అని చెప్పి ఇకపై ఎవరైనా తమకు దగ్గర్లో ఉన్న సెంటర్‌కో, మార్కెట్‌కో, ఇతర ప్రదేశానికో బైక్‌పై హెల్మెట్‌ లేకుండా వెళితే ఇక వారిపై కూడా చలాన్‌ విధించనున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ముందుగా ఈ రూల్‌ను అమలు చేస్తారట. ఈ మేరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌ కుమార్‌ తాజాగా మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఇకపై గల్లీలు, కాలనీల్లో హెల్మెట్‌ లేకుండా తిరిగినా అలాంటి వాహనదారులకు జరిమానా వేస్తారట. ఇప్పటి వరకు కేవలం మెయిన్ రోడ్లలో మాత్రమే హెల్మెట్‌ చెకింగ్‌ చేసే వారు. కానీ ఇకపై గల్లీలు, కాలనీల్లోని రహదారులపై కూడా ట్రాఫిక్‌ పోలీసులు చెకింగ్‌లు చేస్తారట. ఈ క్రమంలో ఎవరైనా వారికి హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతూ కనిపిస్తే వారికి చలానా విధిస్తారు. కనుక బైక్‌ నడిపే వారు ఎవరైనా సరే.. పక్కకే కదా అని చెప్పి హెల్మెట్‌ లేకుండా వెళ్లారో.. ఫైన్‌ వేస్తారు జాగ్రత్త..!

Comments

comments

Share this post

scroll to top