గబ్బర్ సింగ్- 2 కమ్మింగ్ సూన్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ రానుంది. గబ్బర్ సింగ్  సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన పవన్ దానికి సీక్వెల్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయారు. ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2′ ప్రాజెక్టు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ చిత్రం లాంచింగ్ మే 29న జరుగబోతోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ డేట్ ప్రకటించనున్నారు.

gabbar

 

 

ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనిషా అంబ్రోస్ లీడ్ హీరోయిన్.    మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్   ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో ప్రారంభం అయ్యాయి.ఎన్నికల తర్వాత పవన్ నటిస్తున్న  మొదటి చిత్రం ఇదే….  దీనికి తోడు వరుస హిట్లతో దూసుకుపోతున్న పవన్ కు ఈ చిత్రం  ఎంతటి విజయాన్ని అందిస్తోందో చూడాలి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top