అభిగ్న అనే యువ‌తికి ఎదురైన ఫ‌న్నీ సంఘ‌ట‌న ఇది. చ‌లాన్ రాయాల‌నుకున్న పోలీస్ కు షాక్‌..!

”ఆ సంవ‌త్స‌రం నాకు స‌రిగ్గా గుర్తుకు లేదు. అప్పుడు మేం మైసూర్‌లో ఉన్నాం. ఓ రోజున నాన్న‌, నేను ఇద్ద‌రం క‌ల‌సి బ‌య‌టికి వ‌చ్చాం. నాన్న బైక్ న‌డుపుతున్నారు. చ‌ల్ల‌ని గాలిలో ఆహ్లాదంగా వెళ్తున్నాం అనుకునే స‌రికి స‌డెన్‌గా ఓ ట్రాఫిక్ పోలీస్ మా బైక్‌కు అడ్డుగా వ‌చ్చాడు. వెంట‌నే నాన్న బైక్‌ను ఆపేశారు. నేను దిగా. నాన్న కూడా దిగారు. నాక‌ప్పుడు అర్థం కాలేదు, ఆ పోలీస్ నాన్న బైక్‌ను ఎందుకు ఆపాడో. వెంట‌నే చెకింగ్ కోసం మా ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. అప్పుడ‌ర్థ‌మైంది, బైక్ పేప‌ర్లు, లైనెన్స్ గ‌ట్రా చూపించ‌మంటాడ‌ని. అయినా నాన్న‌కు, నాకేం భ‌యం. అన్నీ ఉన్నాయి మా ద‌గ్గ‌ర.

బైక్ పేప‌ర్లు అన్నీ క‌రెక్ట్‌గానే ఉన్నాయి. నాన్న చూపించారు. డ్రైవింగ్ లైసెన్స్ చూప‌మ‌న్నాడు. అది కూడా చూపించాడు. నాన్న హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు. స్పీడ్ లిమిట్‌లోనే ఉన్నారు. ఓవ‌ర్ స్పీడ్ వెళ్ల‌డం లేదు. ఎలాంటి ట్రాఫిక్ రూల్ అతిక్ర‌మించ‌లేదు. బైక్ పై ఇద్ద‌రం త‌ప్ప ఎవ‌రూ లేరు. అన్నీ క‌రెక్ట్‌గానే ఉన్నా ఆ పోలీస్ మమ్మ‌ల్ని ఇంకా వెళ్ల‌మ‌ని చెప్ప‌డం లేదు. బైక్‌కేసి అదే ప‌నిగా చూస్తున్నాడు. చాలా సేపు అత‌ను మా వెహిక‌ల్‌ను ప‌రీక్ష‌గా చూశాడు. చివ‌రికి ఏదో సాధించిన‌ట్టు వ‌చ్చి అన్నాడు.

స‌ర్‌, మీ బైక్ నంబ‌ర్ ప్లేట్ స‌రిగ్గా లేదు. ఫైన్ వేస్తా అన్నాడు ఆ పోలీసు. నాన్న అన్నారు.. బాగానే ఉంది సార్‌.. అని. లేదు స‌ర్‌, నంబ‌ర్ ప్లేట్ డ్యామేజ్ అయింది అన్నాడు పోలీస్‌. అది చిన్న స్క్రాచ్ అండీ, పెద్ద డ్యామేజ్ కాదు కదా అన్నారు నాన్న‌. లేదు స‌ర్‌, ప‌గులు చిన్నగా ఉన్నా, పెద్ద‌గా ఉన్నా డ్యామేజ్ డ్యామేజే, ఫైన్ ఫైనే అంటూ.. ఓ మిష‌న్ తీసి అందులో డేటా ఫీడ్ చేయ‌బోయాడు. చాలా సేపు ఆ పోలీసు ట్రై చేశాడు, కానీ మిష‌న్ ప‌నిచేయ‌లేదు, చివ‌ర‌కు అత‌నే అన్నాడు, మీ ల‌క్ బాగుంది సార్‌, మిష‌న్ ప‌నిచేయ‌డం లేదు, వెళ్లిపోండి అన్నాడు పోలీస్‌. ప‌క్క‌కు వ‌చ్చి న‌వ్వా. నాన్న వారించారు. అవును మ‌రి నిజ‌మే, ఎప్ప‌టికైనా న్యాయ‌మే గెలుస్తుంది. అన్యాయ‌మే ఓడుతుంది.”

— అభిగ్న అనే ఓ యువ‌తి త‌న తండ్రితో క‌ల‌సి బైక్‌పై వెళ్తుండ‌గా జ‌రిగిన రియ‌ల్ ఘ‌ట‌న ఇది. పోలీసులు ఇలా ఉంటే ఎవ‌రూ ఏం చేయ‌లేరు.

Comments

comments

Share this post

scroll to top