ట్రైన్ లో ఓ అమ్మాయికి, మూగ అబ్బాయికి మధ్య జరిగిన సంభాషణ.!?

ప్రయాణాలు చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఒక్కొక్కరు ఒక్కో పంథాను అవలంభిస్తారు. కొంత మంది బుక్స్ చదువుతూ, కొంతమంది పాటలు వింటూ, ఇంకొంత మంది ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ….మరికొంత మంది తోటి ప్రయాణికులను ఫ్రెండ్స్ చేసుకొని వారితో ముచ్చట్లు పెడుతూ…..ఇలా తమ జర్నీని బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకుంటారు. అయితే తన జీవితంలో జరిగిన ఓ మర్చిపోలేని ప్రయాణాన్ని  ఓ అమ్మాయి…ఇలా నెటీజన్లతో పంచుకుంది… ఆమె కథ ఆమె మాటల్లోనే…..

” హైద్రాబాద్ నుండి బెంగుళూరు వెళుతున్నాను….ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అవ్వడంతో హడావుడిగా ట్రైన్ ఎక్కాను. నేను బుక్ చేసిన  A/C కంపార్ట్ మెంట్ అప్పర్ బెడ్ లోకి మూవ్ అవుతున్న సమయంలో కింద కూర్చున్న ఓ అందమైన అబ్బాయి హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అనే బుక్ చదువుతూ కనిపించాడు. అతనిని చూడగానే  అతనితో మాట్లాడాలి అనిపించింది. మాట కలపడం ఎలా అనుకుంటూనే…..హయ్ మీరు చదివే బుక్ చాలా బాగుంటుంది అని అన్నాను…. అతడి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు….  హలో…!  మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని చెప్పా…అయినా అతను పలకలేదు…చాలా సార్లు చాలా విధాలుగా అతనిని పలకరించే ప్రయత్నం చేశా….అయినా అతడి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక వీడు మనకు సెట్ అయ్యే రకం కాదనుకొని నా అప్పర్ బెడ్ మీదకు చేరి ఈయర్ ఫోన్స్ లో పాటలు వింటున్నా…..

అంతలోనే ఆ కుర్రాడు ఓ స్లిప్ చేతిలో పెట్టాడు. ” నేను Deaf & Dumb , వినలేను, మాట్లాడలేను..మీరు చాలాసేపటి నుండి నాతో ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు.  మీకు అభ్యంతరం లేకపోతే…మనం ఇలా చిట్టీలలో రాసుకుంటూ మాట్లాడుకుందాం” అంటూ రాసి ఉంది ఆచిట్టిలో….సరే అనుకొని.. చాలా సేపు ఇలాగే స్లిప్స్ ద్వారా మాట్లాడుకున్నాం.అతడు చాలా సిల్లీ, ఫన్నీ ప్రశ్నలు అడగడం దానికి నేను సమాధానం చెప్పడం…ఇలా సాగింది మా కాన్వర్జేషన్.

ఇక అయిదు నిమిషాల్లో ట్రైన్ దిగిపోతాం అనుకునే టైమ్ లో …నా చేతిలో ఓ స్లిప్ పెట్టి…ఇది ఇప్పడే కాదు..దిగిన తర్వాత చదవండి అని సైగ చేశాడు. సరే అనుకొని ట్రైన్ దిగాక…క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ లో కూర్చొని…అతడు ఇచ్చిన స్లిప్ ను ఓపెన్ చేసి చదవసాగాను………………………………………….

” సారీ…మీరు అనుకుంటున్నట్టు, నేను మూగ, చెవిటి వాడిని కాదు, ఐయామ్ పర్ఫెక్ట్లీ ఫిట్…కాకపోతే నేను ఓ సైక్రియార్టిస్ట్ ను ఓ రీసెర్చ్ లో భాగంగా…మీతో అలా నటించా…? ఎనీ హౌ థ్యాంక్స్ నా రీసెర్చ్ లో పాల్గొన్నందుకు……మరో విషయం నేను గ్రాఫాలజిస్ట్ ను( చేతిరాత చూసి వ్యక్తిత్త్వం చెప్పడం) ….మీ స్లిప్స్ లో ఉన్న చేతిరాత అంత బాగాలేదు….అర్జెంట్ గా మార్చుకోండి ” అంటూ ఉంది ఆ స్లిప్ లో….

ఒక్కసారిగా నా ప్రయాణాన్ని, ఆ వ్యక్తిని గుర్తుతెచ్చుకొని…నా అమాయకత్వాన్ని చూసుకొని నాలో నేనే నవ్వుకున్న.

Comments

comments

Share this post

scroll to top