ఎఫ్1, ఎఫ్2 .. వీటిని కీబోర్డ్ పై చూసే ఉంటాము.. మరి వీటి ఉపయోగం ఏంటో తెలుసా ??

సాధారణంగా కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఎప్పుడో ఒక్కసారైనా వాడే ఉంటాము. కీబోర్డ్ లో పైన వరుసలో ఎఫ్1 , ఎఫ్2.. అలా ఎఫ్12 వరకు ఉంటాయి. వీటిని ఫంక్షన్ కీస్ అని అంటారు. వీటిని మనము ఎక్కువగా వాడము. కానీ వాటిని వాడడం తెలిస్తే ఎంతో సమయం ఆదా అవుతుంది. మరి వాటి వాళ్ళ ఉపయోగం ఏంటో తెలుసుకుందాము..

# ఎఫ్1 – ఈ బటన్ నొక్కితే ఎలాంటి ప్రోగ్రాంకైనా హెల్ప్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.

# ఎఫ్2 – ఫైల్ లేదా ఫోల్డర్ పేరు మార్చడానికి దీని ఉపయోగించవచ్చు.

# ఎఫ్3 – ప్రస్తుతం ఓపెన్ ఉన్న అప్లికేషన్ లో సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.

# ఎఫ్4 – ఆల్ట్ + ఎఫ్ ౪ నొక్కితే ఓపెన్ చేసి ఉన్న విండోస్ అని క్లోజ్ అవుతాయి.

# ఎఫ్5 – ఈ బటన్ నొక్కితే ప్రస్తుతం ఓపెన్ అయ్యి ఉన్న పేజీ లేదా డాక్యుమెంట్ రిఫ్రెష్ లేదా రీలోడ్ అవుతుంది.

# ఎఫ్6 – ఇంటర్నెట్ బ్రౌసర్ లో అడ్రస్ బార్ దగ్గరకి తీసుకెళ్తుంది.

# ఎఫ్7 – మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ లో స్పెల్లింగ్ చెక్ చెయ్యడానికి వాడుకోవచ్చు.

# ఎఫ్8 – కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు బూట్ చెయ్యాలి అనుకుంటే ఈ బటన్ నొక్కాలి.

# ఎఫ్9 – మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్ ద్వారా మెయిల్ పంపడానికి పనికొస్తుంది.

# ఎఫ్10 – ఓపెన్ చేసి ఉన్న అప్లికేషన్ లో మెనూ బార్ ఓపెన్ అవుతుంది.

# ఎఫ్11 – ఫుల్ స్క్రీన్ కావలి అంటే ఈ బటన్ నొక్కాలి.

#ఎఫ్12 – మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ‘సేవ్ యస్ డైలాగ్ బాక్స్’ ఓపెన్ అవుతుంది.

Comments

comments

Share this post

scroll to top