నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఈ పదాలను ఓ సారి గుర్తుచేసుకోండి.

Come on fight with life.. కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు, అదీ చేతకాకపోతే పాకుతూ పో,అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు..ఉద్యోగం రాలేదని,వ్యాపారం దెబ్బతిందని,స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా?దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే..

తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు, పారే నది..వీచే గాలి…ఊగే చెట్టు..ఉదయించే సూర్యుడు…అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా… ఏదీ ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు.

hqdefault (1)-tile

లే బయలుదేరు, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో..పడ్డచోటు నుండే పరుగు  మొదలుపెట్టు, నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయ్..నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో..నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.. మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట  చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో…చదివితే ఇవి పదాలు మాత్రమే..ఆచరిస్తే అర్జునుడి గాండీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top