అమ్మాయితో లవ్ కు…జల్సాలోని పవన్ కళ్యాణ్ కు లింకేటబ్బా? ఈ కుర్రాడినడిగితే చెబుతాడు.

కష్టాలు అంటే ఎలా ఉంటాయో నీకు తెలుసా? ఖరీదైన బైకుల్లో తిరుగుతూ, ఏసీ రూముల్లో ఉంటూ  వేలకువేల రూపాయల డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతున్న నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. నిజజీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో నేను చెబుతాను నువ్వు విను ఈ రోజు..”స్కూల్ కు వెళ్ళాలంటే పోను 4కి,మీ. రాను 4కి.మీ రోజుకు 8 కి.మీ నడవాలని సంగతి నీకు తెలుసా..?అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరి అన్నం  తింటారని, పరమాన్నం వండినప్పుడే  పండగ  అంటారని నీకు తెలుసా? ఆడుకోవాల్సిన పసివయసులో సరైన వైద్యం అందక   పిల్లలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేస్తే నేల  వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు  చూసే మనుషులున్నారు నువ్వు బతికే ఈ సమాజంలో ఉన్నారని నీకు తెలుసా? తండ్రి చనిపోయిన ఆరు గంటలకే తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించావా?నేను అనుభవించాను. అనే డైలాగ్ ను  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా ఈ డైలాగును చెబుతాడు. థియేటర్లలో ఈ డైలాగుకు ఫుల్ విజిల్సే విజిల్స్.

ప్రస్తుతం ఇలాంటి పాపులర్ డైలాగులను స్ఫూఫ్స్ గా రూపొందించి యువతరం తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి, తన ప్రేయసి వల్ల ఎన్ని కష్టాలు ఎదుర్కున్నాడో? ఆ బాధ ఎలా ఉంటుందో? ఎమోషనల్ అయిపోయి జల్సా డైలాగ్ కు స్ఫూఫ్ చేశాడు. ఇది చూసి అమ్మాయిలు ఎలా ఫీలవుతారో గానీ అబ్బాయిలు మాత్రం నిజం బాస్ అంటూ తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top