మీకిష్టమైన పండు అదా.? అయితే మీ మనస్తత్వం ఇది.!

కొన్ని సర్వేలు భలే గమత్తుగా ఉంటాయి. మన అభిరుచిని బట్టి మన మనస్తత్వాన్ని లెక్కగడతాయి. నిన్నటి వరకు రక్త వర్గాలను బట్టి మనస్తత్వాన్ని చెప్పింది  ఓ సర్వే, ఇప్పుడు మరో కొత్త సర్వే ప్రచారంలోకి వచ్చింది. మీకు ఇష్టమైన ప్రూట్ ను బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేస్తోంది ఈ సర్వే.. మరి మీకిష్టమైన ప్రూట్ ఏది ? దానిని ఇష్టపడే మీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోండి( ఇది కేవలం సర్వే మాత్రమే.. ఇది  మీ విషయంలో నిజం కావొచ్చు, కాకపోవోచ్చు-షరతులు వర్తిస్తాయి అనే టైప్ అన్నమాట.)

అరటి పండు:

మీరు సాధారణ వ్యక్తిత్వం గలవారు. త్వరగా సర్దుబాటు చేసుకోగల మనస్తత్వం వీరిది. అవసరాన్ని బట్టి మెలుగుతుంటారు. డబ్బు ను ఆదా చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అందంపైన అంతగా శ్రద్ద చూపరు.

జామపండు:  

ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.  పిసినారితనం వీరికి చిరునామ.పాత పద్దతులు ఫాలో అవుతుంటారు. పూర్వపు ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వీరు తమ జేబులో చిల్లర డబ్బులు  తప్పక మేయింటేన్ చేస్తారు.

ఆపిల్:

వీరి సంపాదనలో సగం అందానికే ఖర్చు చేస్తారు.ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ నెస్ క్రీమ్ లు…ఇలా  వీరి బడ్జెట్ లో చాలా వరకు సౌందర్యలేపనాలకే వెచ్చిస్తారు. చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు. హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. పని విషయంలో పరమ బద్దకస్తులు.

దానిమ్మ:

ఓపిక ఎక్కువగా ఉన్నవాళ్లు, విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. తెలివిగల నిర్ణయాలు తీసుకుంటారు. పక్క వాళ్ల విమర్శలను పట్టించుకోరు, తమ పని తాము చేసుకుంటూ పోతారు.

ద్రాక్ష:

చాలా హుషారుగా ఉంటారు. పార్టీలు, పంక్షన్లకు తప్పక అంటెడ్ అవ్వాలని చూసే రకం. ఫెర్ ఫ్యూమ్స్ ను ఎక్కువగా యూజ్ చేస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.  సినిమాలపై ఇంట్రస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఫైనాపిల్:

తిండి ప్రియులు, నాన్ వెజ్ అంటే పడిచస్తారు. బాధ్యతాయుతంగా ఉంటారు. ఏదైనా పని అప్పగిస్తే పూర్తయ్యిందాక పట్టు విడవరు.

మ్యాంగో:  

పల్లెటూర్లను ఇష్టపడతారు. ప్రతీదీ పద్దతిగా జరగాలని కోరుకుంటారు. వీరి మనస్సు చాలా విషాలమయినది అందుకే త్వరగా లవ్ లో పడిపోతారు. సిగ్గు కూడా ఎక్కువే.

ఆరెంజ్:

జాతకాలను నమ్ముతారు, దేవుడంటే విపరీతమైన భక్తి ఉంటుంది. వీళ్లకు కార్ల మీద మోజుక్కువ. లక్షాదికారులు కావాలని కలలు కంటారు. మరీ అంతగా కష్టపడరు కానీ స్మార్ట్ వర్క్ లో ముందుంటారు.

సపోట:

సిక్స్ పాక్ వీరులు వీరు.  ఎక్స్ సర్సైజ్ ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లో పెత్తనం వీరిదే, భాషా టైపు అన్న మాట. గొడవల్లో ఫస్ట్ ఉంటారు.

For FB Updates: CLICK HERE

fruit says yours psycholofy

చూశారుగా ఇలా ఉంటుందంట..ఇష్టాన్ని బట్టి  నేచర్ గురించి చెప్పే పద్దతి. ఒక్కమాటలో చెప్పాలంటే   ప్రూట్ కో సైకాలజీ అన్న మాట!  చెర్రి, బాదాం,పిస్తా, ఖర్జూరం అంటూ మీ లిస్ట్ ను చదవకండి ఎందుకంటే సర్వే చేసింది ఈ ప్రూట్స్ మీదే అందుకే వాటి గురించి ప్రస్తావించడం జరిగింది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top