ఇది నటుడి డైరీలోని ఓ పేజీ..తన భార్య గురించి రాసుకున్నాడు.!

నాకు 19 యేళ్ళప్పుడు పెళ్ళైంది, అప్పుడు నా భార్యకు 17 , తన పేరు మోహరున్నీస.  నేను చిన్నప్పటి నుండి హైఫై గా పెరిగాను, ఫ్యాషన్ గా ఉండడం, మోడ్రన్ దుస్తులు ధరించడం నాకు చాలా ఇష్టం. నా చుట్టుపక్కల వారు కూడా ఫ్యాషనబుల్ గా ఉండాలని కోరుకుంటాను. కానీ నా భార్య మాత్రం చాలా ట్రెడేషనల్ గా ఉంటుంది. కట్టు, బొట్టు అంతా సాంప్రదాయ బద్దంగా ఉండేలా చూసుకుంటుంది. నేను ఎన్నో సార్లు చెప్పా..మారమని, ఫ్యాషన్ గా ఉండమని. నా ఇంటికి చాలా మంది వస్తారు నువ్వు ఇలా ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుందని,  కొన్ని సార్లు గట్టిగానే మందలించాను…..అప్పుడు ఆమె మరీ అంతగా కాకున్నా కొంతమేర తన ప్రవర్తన మార్చుకుంది. ఇంకా….ఇంకా ..ఇంకా అని చాలా సార్లు కోరాను. కానీ ఆమె మాత్రం అలాగే ఉంటానని చెప్పింది.

అప్పటికే మాకు ఇద్దరు పిల్లలు,  పెళై దాదాపు 10 యేళ్ళు కావొస్తుంది. ఇది మారదు అనుకున్న….వెంటనే విడాకులు ఇచ్చి, నాతో పాటు సినిమాల్లో నటించే మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్న… నా కొత్త జీవితం చాలా కలర్ ఫుల్ గా గడుస్తుంది. నా కొత్త పార్టనర్ మస్త్ ఫ్యాషనబుల్గా ఉంటుంది. ఆమెతో నాజీవితం స్టార్ట్ అయిన తర్వాత నేను మెహరున్నీసను, నా ఇద్దరు పిల్లలను పూర్తిగా మర్చిపోయాను.  కానీ కొన్ని రోజుల తర్వాత నా కొత్త భార్య ప్రవర్తన నాకు వింతగా అనిపించింది…తన మేకప్, డ్రసప్ మీద పెట్టిన ఇంట్రస్ట్ నా మీద పెట్టడం లేదు… ఎప్పుడూ అద్దంలో తన అందాన్ని చూసుకుంటూనే గడిపేది…నా అవసరాలనే కాదు, నన్ను కూడా పట్టించుకోడం మానేసింది. ఫ్యాషనబుల్గా ఉంది కానీ భార్యగా మాత్రం లేదు. లంకంత కొంపలో ఇద్దరం మనుషులం గా కాకుండా యంత్రాలుగా ఉన్నాం…ప్రేమ,అనురాగం,ఆప్యాయత అనే పదాలకు ఇక్కడ ఇంత చోటు కూడా లేదంతే…!!!

ఓ రోజు  బాల్కానిలో కూర్చొని పేపర్లో వచ్చిన .మాధుర్ జాఫ్రి వంటకాలు..అద్భుతాలు ….అని ఉన్న ఓ ఆర్టికల్ ను చదువుతున్నా… పేజ్ కింద ఓకార్నర్ లో మాధర్ జాప్రి అంటూ ఓ అందమైన అమ్మాయి  ఫోటో ఉంది… పేస్ కట్ చూడడానికి నా మాజీ భార్యలాగా ఉంది, కాదు ఆమె నా మాజీ భార్యే….పేరు మార్చుకుందా…? వేరే పెళ్ళి చేసుకుందా….? అంటూ అనేక ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయ్…ఎలాగో అడ్రస్ కనుక్కొని ఆమె ఇంటికి వెళ్ళాను..కానీ ఆమె నన్ను కలవడానికి ఇష్టపడలేదు.

కానీ 14 యేళ్ళ అమ్మాయి, 12 యేళ్ల అబ్బాయి…( నా పిల్లలు) ..నాతో చివరిసారిగా మాట్లాడారు..  ఇప్పుడు ఆమెను చేసుకున్న భర్త కూడా ఆమె వెనుకే నిలబడి ఉన్నాడు. ఇప్పటికీ ఆమె ముందులాగే ఉంది. సాంప్రదాయబద్దమైన దుస్తులతో, నిండుగా….!   తన తప్పు తెలుసుకున్నాడు… కానీ నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్టు విధి అతడిని వెక్కిరించింది. ఆమె ఇప్పుడు వరల్డ్ ఫేమస్ చెఫ్……కానీ ఆమెను ప్రోత్సాహించింది మాత్రం ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఇప్పుడున్న భర్తే…

నీతి: మీకు ఏమనిపిస్తే అది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top