మీ ఏటీఎం లో ఈ చిప్ లేకపోతే అది రేపటి నుండి పనిచేయదు. చిప్ ఉన్న ఏటీఎం కంపల్సరి…

మీ ఏటీఎం కార్డు మీద మొబైల్ సిమ్ లాంటి ఒక చిన్న చిప్ లేకుంటే, మీ ఏటీఎం కార్డు రేపటి నుండి పనిచేయదు. వివరాల్లోకెళితే, సాధారణంగా ఏటీఎం కార్డు వెనకాల నల్లని మాగ్నటిక్ స్ట్రిప్ (పట్టీ) ఉంటుంది. ఆ స్ట్రిప్ లో వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ కార్డు ని ఏటీఎం లో పెట్టినప్పుడు ఆ స్ట్రిప్ లో ఉండే వివరాలను స్కాన్ చేసి ప్రాసెస్ చేస్తుంది ఏటీఎం మెషిన్, దాని వలన లావాదేవీలు చేసుకోడానికి వీలుపడుతుంది.

 

ఏటీఎం మెషిన్ లలో హ్యాకర్లు స్కిమ్మర్స్ ని రహస్యంగా అమర్చి మన ఏటీఎం కార్డు డీటెయిల్స్ ని దొంగలించి, నకిలీ కార్డు తయారు చేసి మన ఖాతాలోనుండి డబ్బులు ఎత్తేస్తారు. ఇలా నేరం చేస్తున్న నేరగాళ్ల సంఖ్య బాగా పెరగడం తో.నేరాలను అరికట్టేందుకు 2015 లో ఈఎంవీ చిప్‌లతో కూడిన ఏటీఎం కార్డులను జారీ చేయాలని దేశంలోని అన్ని బ్యాంకులనూ 2015లో ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ మూడు సంవత్సరాల కాలం లో చాలా బ్యాంక్స్ వారి కస్టమర్ ల ఓల్డ్ ఏటీఎం కార్డు లకు బదులుగా ఈఎంవీ చిప్ లు కలిగిన ఏటీఎం కార్డు లను జారీ చేసింది.

బ్యాంకు కి వెళ్లి మీ పాత స్ట్రిప్ కలిగిన ఏటీఎం కార్డు ని బ్యాంకు లో ఇచ్చి కొత్త ఈఎంవీ చిప్ లతో కూడిన ఏటీఎం కార్డు లను పొందవచ్చు, అయితే ఇప్పటికి ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలు కలిగిన చాలా మంది ఈఎంవీ ఏటీఎం కార్డు లను తీసుకోలేదు, దీంతో పాత కార్డులను 31 డిసెంబర్ 2018 తో నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు, రేపటి నుండి ఏటీఎం యూస్ చెయ్యాలి అంటే ఈఎంవీ ఏటీఎం కార్డు లు కంపల్సరి గా ఉండి తీరాల్సిందే.

భద్రత కోసమే :

ఈఎంవీ చిప్ లు ఉన్న ఏటీఎం కార్డు లను హ్యాక్ చెయ్యడం అంత సులువు కాదు, అందులోనుండి మన డేటా ను కలెక్ట్ చేసుకోవాలి అంటే చాలా కష్టం, ఈ చిప్‌లలో వినియోగదారుల సమాచారం ఎవరూ అర్థం చేసుకోలేని కోడ్‌ భాషలోకి మార్చి ఉంటుంది. కనుక మన ఖాతా భద్రత కోసమే పాత ఏటీఎం లను మార్చుకోవాలని ఆర్‌బీఐ ఆదేశం జారీ చేసింది.

Tweet:

 

Comments

comments

Share this post

scroll to top