ఈ సంఘటన తెలిస్తే మీరు అస్సలు “ఫ్రెంచ్ ఫ్రైస్” తినరు!…Mc Donalds “French Fries” లో “బల్లి” ఫ్రై అయ్యి వచ్చింది ఆమెకి..!

మెక్ డొనాల్డ్స్..! ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు నోరూరించే బ‌ర్గ‌ర్లు… పిజ్జాలు… ఇత‌ర జంక్ ఫుడ్ ఐట‌మ్స్ గుర్తుకు వ‌స్తాయి క‌దూ..! ఒక‌ప్పుడు కేవ‌లం ధ‌నవంతులు మాత్ర‌మే ఈ రెస్టారెంట్ల‌లోకి వెళ్లి ఆయా ఫుడ్స్‌ను ఆర‌గించే వారు, కానీ ఇప్పుడు అలా కాదుగా. ప‌రిస్థితి మారింది. ఆర్థిక వ‌న‌రులు పెరిగాయి. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి వారు కూడా ఇలాంటి రెస్టారెంట్ ఫుడ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అది ఓకే..! న‌చ్చిన ఆహారం తిన‌డంలో త‌ప్పులేదు. కానీ… ఓ సారి చూసి తింటే మంచిది..! ఎందుకంటే… ఎంత పేరు మోసిన రెస్టారెంట్ అయినా… అక్క‌డ వడ్డించేది కూడా ఆహార‌మే క‌దా..! అలా అని చెప్పి దాన్ని చూడ‌కుండా తిన్నారో… ఇక అంతే..! లేదంటే ఆ మ‌హిళ‌కు వ‌చ్చిన‌ట్టు ఆహారంలో ఫ్రై అయిన బ‌ల్లి వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

mc-donalds-french-fries

ఆమె పేరు ప్రియాంకా మోయిత్రా..! ప్రెగ్రెన్సీతో ఉంది. అప్ప‌టికే ఆమెకు 4 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే మొన్నా మ‌ధ్యే ఆమె స‌ర‌దాగా అలా బ‌య‌టికి వెళ్లి త‌న భ‌ర్త‌, బిడ్డ‌తో మెక్ డొనాల్డ్స్‌లో ఫుడ్ తిన‌డం కోసం ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో పాటుగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డ‌ర్ చేసింది. ఈ క్ర‌మంలో ఆమె తింటున్న ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఫ్రై అయిన ఓ బ‌ల్లి కూడా వ‌చ్చింది. అది ఎప్పుడు ప‌డిందో, ఎంత మొత్తంలో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ప‌డిందో తెలీదు. కానీ వారు తింటున్న ఫ్రెంచ్ ఫ్రైస్‌లో వ‌చ్చింది. దీంతో ప్రియాంకాతోపాటు ఆమె భ‌ర్త కూడా ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

lizard-in-french-fries

inside-mc-donalds
జ‌రిగిన విష‌యాన్ని వెంట‌నే ఆ రెస్టారెంట్ మేనేజ‌ర్‌తో చెప్ప‌గా, అత‌ను తాపీ వ‌చ్చి సారీ చెప్పి ఫుడ్ ను మార్చి ఇచ్చాడు. దీంతో ప్రియాంకా భ‌ర్త‌కు సంతృప్తి క‌ల‌గ‌లేదు. వెంట‌నే ఆ విష‌యాన్ని మెక్ డొనాల్డ్స్ ఉన్న‌తాధికారుల వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా వారి నుంచి కూడా అదే రీతిన స‌మాధానం వ‌చ్చింది. వారు కూడా సింపుల్‌గా సారీ చేప్పారు. అయినా వారు సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌పై కేసు పెట్టారు. ఇంత‌కీ ఈ సంఘ‌ట‌న జ‌రిగింది ఎక్క‌డో తెలుసా..?  కోల్‌క‌తాలో ఉన్న ఈఎం బైపాస్ ఏరియాలోని మ‌ణి స్క్వేర్ మాల్ మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో..! మ‌రి అదే సంస్థ‌కు చెందిన అన్ని రెస్టారెంట్ల‌లో ఇలాగే ఉంటుందా..? అంటే.. ఏమో చెప్ప‌లేం..! కానీ… ఎందుకైనా మంచిది బ‌య‌ట మ‌నం ఏ రెస్టారెంట్‌లో ఏ ఫుడ్ తిన్నా ఓ సారి చూసి తిన‌డం మంచిది. లేదంటే ఏ బ‌ల్లినో, పురుగునో మింగాల్సి వ‌స్తుంది..! ఆ త‌రువాత అనారోగ్యం పాలైతే బాధ‌ప‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు..!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top