251 రూపాయలకే స్మార్ట్ ఫోన్.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పురుడు పోసుకున్న కొత్త గాడ్జెట్!

నాలుగు అంగుళాల డిస్ ప్లే, 1 జీబీ ర్యామ్, 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్,  8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , 32 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ  ,3.2 మెగా ఫిక్సెల్ బ్యాక్ కెమెరా,  0.3 మెగా ఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1450 mah బ్యాటరీ, ధర:రూ.251 మాత్రమే…  ఫోన్ నేమ్: ఫ్రీడమ్ 251 ఏంటి నమ్మడం లేదా? అవును మీరు విన్నది నిజమే. ఇంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా? మనదేశంలో రూ.251 లకు ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది. అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందించాలన్న ఉద్దేశ్యంతో నొయిడాకు చెందిన ‘రింగింగ్ బెల్స్’కంపెనీ బుధవారం సాయంత్రం ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. అయితే ఇంతకుముందు అతి తక్కువ ధరకే ఈ ఫోన్ అందిస్తామని ఆ సంస్థ చెప్తూ వచ్చింది. మొదట రూ.500 ఉంటుందని అంతా అనుకున్నారు. కాగా ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్ గా ఫ్రీడమ్ 251 రికార్డ్ అని చెప్పుకోవచ్చు.

Ringing-Bells-Freedom-251

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్, ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఈ ఫోన్ ను తయారుచేసినట్లు రింగింగ్ బెల్స్ తెలిపింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నారు. స్మార్ట్ ఫోన్ లేదని బాధపడే యూత్, కేవలం పట్టణ ప్రజలకు మాత్రమే పరిమితమైన స్మార్ట్ ఫోన్స్, ఈ తాజా స్మార్ట్ ఫోన్ రాకతో ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది.

Ringing-Bells-Freedom-251-624x351

అయితే ఇప్పటికే ఈ ఫోన్ ను దక్కించుకోవడం కోసం ఆన్ లైన్ లో బుకింగ్ కోసం కుస్తీ పడుతున్నారు  చాలామంది యువకులు.

Comments

comments

Share this post

scroll to top