కేసులో కొత్తమలుపు: ఫ్రీడమ్ 251 గుర్తుందా..? సడన్ గా అందులో “జియో” ను ఇరికించారు.! ఎలాగో తెలుసా.?

రింగింగ్ బెల్స్ కంపెనీ గుర్తుంది క‌దా. అదేనండీ.. గ‌తేడాది ఫ్రీడం 251 పేరిట కేవ‌లం రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామ‌ని సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఏకంగా 7 కోట్ల మంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నారు. అయితే డెలివ‌రీ విష‌యానికి వ‌చ్చే స‌రికి ఈ కంపెనీ చేతులెత్తేసింది. స్మార్ట్‌ఫోన్ల‌ను ఇవ్వ‌డం త‌మ వ‌ల్ల కావ‌డం లేద‌ని చెప్పింది. దీంతో ఘ‌జియాబాద్‌కు చెందిన ఓ మొబైల్ డిస్ట్రిబ్యూట‌ర్ రింగింగ్ బెల్స్ కంపెనీ ఓన‌ర్ మొహిత్ గోయెల్‌పై కేసు పెట్టాడు. త‌న‌ను మొహిత్ రూ.16 ల‌క్ష‌ల వ‌ర‌కు చీట్ చేశాడ‌ని అత‌ను కేసు పెట్ట‌గా రింగింగ్ బెల్స్ చాప్ట‌ర్ క్లోజ్ అయింది. దీంతో మొహిత్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. అలా అత‌ను 6 నెల‌ల పాటు జైలులో ఉండి ఈ మ‌ధ్యే బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

అయితే మొహిత్ తాను ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌ను మ‌ళ్లీ తెస్తాన‌ని అంటున్నాడు. గ‌తంలో తాను ఈ ఫోన్ల కోసం ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు రూ.3.50 కోట్ల వ‌ర‌కు ఇచ్చాన‌ని కానీ వారు త‌న‌ను మోసం చేశార‌ని, దీంతో వారిద్ద‌రిపై ఇప్పుడు కేసు పెట్టాన‌ని మొహిత్ తాజాగా చెప్పాడు. అయితే త‌న ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్‌ను కాపీ కొట్టి ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థ‌లు రూ.1500, రూ.1300 కే ఫోన్ల‌ను అందిస్తున్నాయ‌ని అది ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నించాడు. తాను ఆ కంపెనీలంత పెద్ద వ్య‌క్తిని కాద‌ని, త‌న‌కు ప్ర‌భుత్వం స‌పోర్ట్ లేద‌ని, అందుకే ఫ్రీడం 251 ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌లేక‌పోయాన‌ని చెప్పాడు. త్వ‌ర‌లోనే మళ్లీ ఈ ఫోన్ కోసం రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభిస్తాన‌ని చెప్పాడు.

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఫ్రీడం 251 ఫోన్ బుకింగ్స్ ఓపెన్ చేసి మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో వాటిని వినియోగ‌దారుల‌కు డెలివ‌రీ చేస్తాన‌ని అంటున్నాడు మొహిత్‌. అయితే త‌న‌కు ప్ర‌భుత్వాలు స‌పోర్ట్‌ను అందించాల‌ని అంటున్నాడు. దాంతో ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు అందించ‌వ‌చ్చ‌ని చెబుతున్నాడు. ఇక మ‌రి మొహిత్ మ‌ళ్లీ ఇదే పేరుతో ఫోన్ల‌ను అమ్ముతాడా ? లేదంటే కొత్త పేరుతో ఫోన్‌ను విడుద‌ల చేస్తాడా ? చూడాలిక‌. ఏది ఏమైనా ఇలా మోసం చేసే వాళ్ల‌ను మ‌ళ్లీ జ‌నాలు న‌మ్ముతారా..? డౌటే..!

Comments

comments

Share this post

scroll to top