ఇలా మోసపోకండి…. ఉద్యోగాల పేరుతో గాలం వేసే వారితో తస్మాత్ జాగ్రత్త!

తమ పిల్లలకు మంచి భవిష్యత్ ను ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కొడుకు జీవితం సెటిల్ అవుతుందంటే పేరెంట్స్ ఏం చేయడానికైనా వెనకాడరు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కునైనా సరే వారికి కావాల్సింది ఇస్తారు. అలాంటి తల్లిదండ్రులకు మీ బిడ్డలను లైఫ్ లో సెటిల్ చేసే బాధ్యత మాది. లక్షలో జీతాలు వచ్చే ఉద్యోగాలు చూపిస్తాం.. మీ బిడ్డల భవిష్యత్ పై ఎలాంటి బెంగ అవసరం లేదని మాయమాటలు చెప్పి 300 మంది దగ్గర నుండి రూ. 3 కోట్లు వసూల్ చేసి చివరికి  జెండాఎత్తారు ఓ ముఠా. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వారి దగ్గర మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని బాధితులు చెప్పిన వివరాల ప్రకారం విచారణ చేయగా ఆ ముటాలో ఐదుగురిని పట్టుకున్నట్లు, మరో మగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

call-centre

ప్రతిరోజూ న్యూస్ పేపర్ లోనూ, టీవీ న్యూస్ ల్లోనూ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పు మోసం చేశారని, వారి చేతిలో మోసపోయామని మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో డబ్బులు కడుతూనే ఉన్నారు. అలాంటి వారిని ఆసరాగా మోసగాళ్ళు మాయమాటలు చెబుతూ ఇంకా తమ ఆగడాలతో రెచ్చిపోతున్నారు. మనలాంటి డబ్బులు కడుతున్న కాలం.,అలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లా పెరుగుతూనే ఉంటారు కానీ అలాంటివి మానరు. సో, మీరు కష్టపడి చదువునే నమ్ముకోండి. మీ కష్టంతోనే ముందుకు వెళ్ళండి కానీ ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోకండి.

Comments

comments

Share this post

scroll to top