ఆ దేశంలోని అంద‌రూ త‌ప్ప‌కుండా అవ‌య‌వ‌ ధానం చేయాల్సిందే. నిర్ణ‌యం ఎలా ఉంది?

అవ‌య‌వ దానం… దీంతో ఒక వ్య‌క్తికి చెందిన అవ‌యాల‌నే అనేక మందికి ఇచ్చి వారి జీవితాల‌కు పున‌ర్జ‌న్మ‌నివ్వ‌వ‌చ్చు. గుండె, కాలేయం, కిడ్నీలు, క‌ళ్లు… ఇలా ఏ అవ‌య‌మైనా చాలు. వ్య‌క్తి ఆరోగ్యంగా ఉండే చ‌నిపోతే అత‌ని అవ‌య‌వాలు ఇత‌రుల‌కు మ‌రో జ‌న్మ‌నిస్తాయి. కానీ మ‌న ద‌గ్గ‌ర అవ‌య‌వ‌దానం ప‌ట్ల అంత‌గా అవ‌గాహ‌న లేద‌నే చెప్ప‌వ‌చ్చు. 100 మందిలో ఏ ఒక్క‌రో ఇద్ద‌రో త‌ప్ప దీన్ని గురించి ప‌ట్టించుకున్నవారు లేరు. కానీ ఆ దేశాల్లో మాత్రం అలా కాదు. అక్క‌డ నివ‌సించే వారు ఎవ‌రైనా చ‌నిపోతే వారి అవ‌య‌వాలను తీసుకుంటారు. అందుకు చ‌నిపోయిన వారి కుటుంబీకుల‌తో ప‌ని లేదు. అలా తీసుకున్న అవ‌య‌వాల‌ను అవ‌సరం ఉన్న ఇత‌రులకు అమ‌రుస్తారు. ఆస్ట్రియా, స్పెయిన్ వంటి దేశాల్లో ఇప్ప‌టికే ఈ విధానం అమ‌లులో ఉండ‌గా తాజాగా ఆ లిస్ట్‌లో ఫ్రాన్స్ కూడా చేరిపోయింది.

organ-donation

2017 జ‌న‌వ‌రి 1 నుంచి ఫ్రాన్స్ దేశం ఓ చ‌ట్టం అమ‌లులోకి తెచ్చింది. దాని ప్ర‌కారం అక్క‌డ నివసించే పౌరులంద‌రూ స్వ‌త‌హాగా అవ‌య‌దానం కింద‌కు వ‌స్తారు. అంటే వారు చ‌నిపోతే వారి అవ‌య‌వాల‌ను తీసుకుని అవ‌స‌రం ఉన్న వారికి అమ‌రుస్తారు. అయితే ఇందుకు గాను చ‌నిపోయిన వారి కుటుంబీకుల అనుమ‌తి అవ‌స‌రం లేదు. కానీ ఎవ‌రైనా ఈ చ‌ట్టంలో భాగ‌స్వాములు కాద‌లుచుకోక‌పోతే, అంటే… అవ‌య‌వ దానం ఇష్టం లేక‌పోతే వారు ఓ రెఫ్యూజ‌ల్ రిజిస్ట‌ర్‌లో త‌మ పేరును న‌మోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో వారి అవ‌య‌వాల‌ను తీసుకోరు. ఈ ఏడాది నుంచి అమ‌లులోకి వ‌చ్చిన ఈ చ‌ట్టం ఎంతో మంది అవ‌య‌వాల కోసం ఎదురు చూస్తున్న బాధితుల‌కు ఓ వరం కానుంది.

అయితే అవ‌య‌వ‌దానంలో మ‌న దేశం ఏ పొజిష‌న్‌లో ఉంద‌య్యా అంటే… మ‌న ద‌గ్గ‌ర ప్ర‌తి 1.60 ల‌క్ష‌ల మంది పేషెంట్ల‌కు కేవ‌లం 12వేల మంది దాత‌లు మాత్ర‌మే ఉన్నారు. దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు, మ‌న ద‌గ్గ‌ర అవ‌య‌వ దానం ఆవ‌శ్య‌క‌త ఎంత ఉందో. మ‌న ద‌గ్గ‌ర కూడా అలాంటి చ‌ట్టం తీసుకొస్తే దాంతో ఎంతో మంది అవ‌య‌వాల కోసం ఎదురు చూడాల్సిన ప‌ని ఉండ‌దు క‌దా. దీంతో చాలా మందికి మేలు క‌లుగుతుంది. కానీ మ‌న దేశంలో ఉన్న‌ది మొత్తం కార్పొరేట్ మెడిక‌ల్ మాఫియానాయే. వారు సందు దొరికితే అవ‌య‌వాల‌ను అమ్ముకోవాల‌నే చూస్తారు, మ‌రి ఇలాంటి చట్టాలు వ‌చ్చేందుకు అంగీక‌రిస్తారా..? అంటే అందుకు ప్ర‌శ్నే స‌మాధాన‌మ‌వుతుంది..!

Comments

comments

Share this post

scroll to top