పద్నాలుగేళ్ల అమ్మాయి హోటల్ కి రమ్మన్నాడు చివరికి ఆమె ఎలా షాకిచ్చిందో తెలిస్తే .?

ఓ వైపు చక్కటి ఉద్యోగం… లక్షల్లో జీతం… భార్య పిల్లలు కూడా ఉన్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ అతనికి సంతృప్తి లేకపోవడంతో కోరి తనంత తాను వచ్చి ఉచ్చులో పడ్డాడు. ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.


తాను ఓ పద్నాలుగేళ్ల అమ్మాయితో చాటింగ్ చేస్తున్నా అనుకున్నాడు కానీ… అవతల ఉన్నది సైబర్ పోలీస్ టీం అన్న విషయం అతనికి తెలీదు. అవతల ఉన్నది బాలిక అనుకుని అసభ్యకర పోస్టులు పంపాడు. కానీ చివరికి అదే పోలీస్ టీం కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
యూకేలో భారత్ కు చెందిన బాల చంద్రన్ కవుంగల్ పరాబత్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఎంతో కాలంగా అక్కడ సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నాడు. యూకేలోని ఈస్ట్ లండన్ లో భార్య పిల్లలతో ఉంటున్నాడు. అయితే ఈ మధ్యే ఆన్లైన్లో 14 ఏళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ అమ్మాయికి అసభ్యకర పోస్టులు పంపేవాడు. అయితే అవతల ఉన్నది అమ్మాయి కాదు ఆన్లైన్లో ఎప్పుడూ నిఘా పెట్టే ఇంటర్నేట్ ఇంటర్సెప్టార్స్. పిల్లలను లైంగికంగా వేధించే వాళ్లని వల పన్ని పట్టుకుంటారు. అదే వీరి పని. అయితే 14 ఏళ్ల బాలిక పేరిట బాల చంద్రన్ తో చాట్ చేసారు. కాగా బాల చంద్రన్ తన నీచ బుద్ధిని బయట పెట్టుకున్నాడు. నీతో కలవాలని సెక్స్ లో పాల్గోనాలని ఉందని మెసేజ్ పెట్టాడు. ఇక్కడ ఉన్నది పోలీస్ టీం ఎలాగైనా బాల చంద్రన్ ను పట్టుకోవాలని ప్లాన్ తో ఉన్న పోలీసులు ఓకే చెప్పేసారు. బాలికను కలుసుకోవడానికి బర్మింగ్ హమ్ వచ్చాడు. ఓ హోటల్ ను కూడా బుక్ చేసాడు. దీంతో బాల చంద్రన్ ను పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. కోర్టులో హాజరుపర్చిన పోలీసులు బాల చంద్రన్ కు 15 నెలలు జైలు శిక్ష వేసారు.

Comments

comments

Share this post

scroll to top