ఆర్థిక‌వేత్త‌ల‌లో అత‌నొక్క‌డే – ర‌ఘురాం రాజ‌న్

ఏ దేశ‌మైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అనుగుణంగా సాగాల్సిందే. ఆ రంగం ఒడిదుడుల‌కు లోనుకాకుండా ఉండాలంటే అనుభ‌వ‌జ్ఞులైన ఆర్థిక‌వేత్త‌ల అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ఇండియా పేరున్నా.ఆర్థిక రంగానికి వ‌చ్చేస‌రిక‌ల్లా ఆఖ‌రున నిల‌బ‌డింది. స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. దేశానికి స్వేచ్ఛ ల‌భించి 70 ఏళ్ల‌కు పైబ‌డినా ఇంకా గ్రోత్ రేట్ విష‌యంలో.ఉపాధిని క‌ల్పించ‌డంలో.పేద‌రికాన్ని రూపు మాప‌డంలో .అన్ని రంగాల్లో ఇంకా ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్న‌ది. సింగ‌పూర్, చైనా, అమెరికా లాంటి దేశాలు వ్యాపార ప‌రంగా, ఆర్థిక ప‌రంగా గ‌ట్టి పునాదుల‌తో ముందంజ‌లో ఉంటున్నాయి. ఆర్థ‌ఙ‌క ప‌ర‌మైన ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కీల‌కం. దీనికి బాధ్య‌త వ‌హించ‌డం అంటే 100 కోట్ల‌కు పైగా జ‌నాభా క‌లిగిన ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండ‌ట‌మే. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు ఆధారం ఆర్బీఐనే. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్ట‌డం వీరి చేతుల్లోనే ఉంటుంది. అందుకే త‌ల‌పండిన ఆర్థిక వేత్త‌ల‌కు ఎక్క‌డ లేనంత ప్ర‌యారిటీ. ప్ర‌తి నిర్ణ‌యంలో వీరి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల్సిందే.ఏ ప్ర‌భుత్వ‌మైనా.

ఇండియాలో అత్యున్న‌తంగా భావించే ఆర్బీఐకి ర‌ఘురాం రాజ‌న్ గ‌వ‌ర్న‌ర్‌గా స‌క్సెస్ ఫుల్‌గా ప‌నిచేశారు. బీజేపీ స‌ర్కార్ కొలువు తీరిన త‌ర్వాత ఆయ‌నను కొన‌సాగిస్తార‌ని అనుకున్నారు.కానీ మోడీ ఒప్పుకోక పోవ‌డంతో ఈ నిబ‌ద్ధ‌త క‌లిగిన ఆర్థిక‌వేత్త వెళ్లిపోయారు. అత్యంత సాధార‌ణ మైన జీవితాన్ని ఇష్ట‌ప‌డే అరుదైన ఆర్థిక‌వేత్త రాజ‌న్. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది మంది ఆర్థిక వేత్త‌ల‌ను ఎంపిక చేస్తే..అందులో మ‌న రాజ‌న్ ఉండే ఉంటారంటే ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌.దాని పోక‌డ‌ల‌ను నిశితంగా ప‌రిశీలించి.నిగ్గు తేల్చే నైపుణ్యం ఈ ఆర్థిక‌వేత్త‌కు ఉన్న‌ది. అందుకే మ‌న్మోహ‌న్ సింగ్ లాంటి అనుభ‌వం క‌లిగిన ఆర్థిక‌వేత్త రాజ‌న్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఐఎం ఎఫ్‌లో ప‌నిచేశారు. ఎంఐటీలో పీహెచ్‌డీ అందుకున్నారు. అహ్మ‌దాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. డిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిల‌లో ప‌లు పుర‌స్కారాలు పొందారు. అవార్డులు అందుకున్నారు రాజ‌న్.

ఆయ‌న పూర్తి పేరు ర‌ఘురాం గోవింద రాజ‌న్. 23వ గ‌వ‌ర్న‌ర్‌గా ఆర్ బీఐకి ఉన్నారు. 1963లో జ‌న్మించిన ఆయ‌న ప‌రిణ‌తి చెందిన ఆర్థిక‌వేత్త‌గా పేరొందారు. చికాగో యూనివ‌ర్శిటీలో ఫైనాన్స్ ప్రొఫెస‌ర్‌గా పాఠాలు బోధిస్తున్నారు. ఇండియాకు ప్ర‌ధాన‌మంత్రిగా మ‌న్మోహ‌న్ సింగ్ ఉన్న స‌మ‌యంలో రాజ‌న్ ఆర్థిక స‌ల‌హాదారునిగా ఉన్నారు. కీల‌క‌మైన పాత్ర పోషించారు. ఐఎంఎఫ్‌కు ముఖ్య ఆర్థిక వేత్త‌గా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లకు సంబంధించిన ఏర్పాటైన ప్ర‌ణాళిక సంఘానికి నాయ‌క‌త్వం వ‌హించారు. మ‌సాచుస్సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఆర్థిక శాస్త్ర విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. స్టాక్ హోం స్కూల్ ఆఫ్ ఎక‌న‌మిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెస‌ర్‌గా సేవ‌లందించారు. భార‌తీయ ఆర్థిక మంత్రిత్వ శాఖ‌తో పాటు ప్ర‌పంచ బ్యాంకు, ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వు బోర్డు, స్వీడిష్ పార్ల‌మెంట‌రీ క‌మిష‌న్ కోసం స‌ల‌హాదారుడిగా ప‌నిచేసిన ఘ‌న‌త రాజ‌న్‌కే ద‌క్కుతుంది. బ్యాంకింగ్ రంగంపై అంద‌జేసిన ప‌త్రం ప్ర‌శంస‌లు పొందింది.

సెప్టెంబర్ 2003 నుండి జనవరి 2007 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 2013 లో అత్యంత చిన్న వయసులో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

నోట్ల ర‌ద్దు భార‌తీయ ఆర్థిక రంగాన్ని కుదిపేసిందని.ఇది త‌ప్పుడు నిర్ణ‌యంగా రాజ‌న్ బాహాటంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న చెప్పిందే ఇవాళ నిజ‌మైంది. ఇప్ప‌టికీ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇంకా గాడిన ప‌డ‌లేదు. కీల‌కంగా ఉన్న గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ త‌ప్పుకున్నాడు. మోడీ, జైట్లీల దెబ్బ‌కు ఆర్బీఐ కుదుపుల‌కు లోన‌వుతోంది. ఈ విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటలో పయనిస్తున్నప్పటికీ డిమానిటైజేషన్‌ ప్రభావంతో భారత జీడీపీ మాత్రం తిరోగమన బాటపట్టాల్సి వచ్చిందన్నారు. ‘‘కేవలం పెద్ద నోట్ల రద్దే కాదు జీఎస్‌టీ అమలు కూడా వృద్ధి రేటుకు గండి కొట్టింది’’ అని అన్నారు. నోట్ల రద్దు కారణంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.1 శాతానికి, 2017-18లో 6.7 శాతానికి జారుకోవ‌డం ప్ర‌మాద సంకేతాలు సూచిస్తున్నాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ వద్దనున్న మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి వస్తే ఆర్‌బీఐ పరపతి రేటింగ్‌ తగ్గవచ్చని రాజన్‌ హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్‌బీఐకి ‘ఏఏఏ’ రేటింగ్‌ ఉంది. పరపతి రేటింగ్‌లలో ఇదే అత్యున్నత స్థాయి. మిగులు నిధుల బదిలీ కారణంగా రేటింగ్‌ తగ్గితే ఆర్‌బీఐపై రుణాల సేకరణ వ్యయం పెరుగుతుందని, తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. పెట్టుబడులకు అంత ఆశాజనకం కాద‌ని, ‘బీఏఏ’ రేటింగ్‌ ఉన్న దేశం. కొన్నిసార్లు విదేశాల నుంచి రుణాలు సేకరించాల్సి వస్తుందన్నారు.

Comments

comments

Share this post

scroll to top