ఆ రైతు మరణించాడు, కానీ 8 మందికి పునర్జీవితం ప్రసాదించాడు.

ఆమె పేరు శాంతి, ఆమె పేరు వెనుక డిగ్రీలు లేవు,   కానీ మనస్సు నిండా  పరోపకార గుణం ఉంది. కళ్ళ ముందు కట్టుకున్న భర్త జీవచ్చంగా పడి ఉంటే …గుండె నిబ్బరంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు  ఎనమిది మందికి పునర్జీవితం ఇవ్వనుంది.  వివరాళ్లోకెళితే..  నెల్లూరు జిల్లాకు  చెందిన  మస్తాన్‌,  తన కుమార్తె మైథిలీ ప్రియతో కలిసి వ్యవసాయ సంబంధిత వస్తువుల కొరకు  మోటారు సైకిల్‌పై  సర్వేపల్లి  టౌన్ కు వెళుతున్న సమయంలో యాక్సిడెంట్  జరిగింది  .

ఈ ప్రమాదంలో మైథిలి ప్రియ గాయపడగా మస్తాన్‌ కు   బ్రెయిన్‌ డెడ్‌  అయ్యాడు. దీంతో డాక్టర్లు మస్తాన్ భార్యకు అవయవదానం మీద కౌన్సెలింగ్ ఇచ్చారు. నా భర్త  చనిపోయి కూడా ఎనమిది మందికి జీవం పోస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. దీనిని నాకు అంగీకారమే అంటూ డాక్టర్లతో చెప్పింది.

శరీరం కాలి బూడిదవ్వడం కంటే మరొకరికి ఆయుష్షునిస్తేనే  నా భర్త ఆత్మ నిజంగా శాంతిస్తుందంటూ ఆమె చెప్పిన మాటలు  ప్రస్తుత  సమాజానికి సూటి ప్రశ్నలు. రక్తధానానికే వెనుకాడే మనకు… శాంతికి ఎంత తేడా?  కాలి బూడిదవ్వడం కంటే ఇంకొకరికి ఆయుష్షు ఇవ్వాలి అంటూ ఆమె చెప్పిన  మాటలు నిజంగా సందేశాత్మకమైనవి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top