వామ్మో… ఇండియాకా… అస్స‌లు వెళ్ల‌వ‌ద్దని విదేశీ మ‌హిళ‌లు అనుకుంటున్నార‌ట‌..! ఎందుకంటే..!

అమ్మో… ఇండియాకా… అస్స‌లు వెళ్ల‌కూడ‌దు. వెళ్లినా చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. అందులోనూ మ‌హిళ‌లు ఇంకా ఎక్కువ సేఫ్టీగా ఉండాలి. వీలున్నంత వ‌ర‌కు తోడు లేకుండా ఇండియాకు అస్స‌లు వెళ్ల‌కూడ‌దు..! ఇదేన‌ట‌… ఇప్పుడు ఇండియా గురించి విదేశీయులు ఎక్కువ‌గా అనుకుంటున్న‌మాట‌. అవును మ‌రి. మ‌న దేశంలో ఉన్న మ‌హిళ‌ల‌కే స‌రిగ్గా ర‌క్ష‌ణ లేదు. ఇక ఫారిన్ మ‌హిళ‌ల‌కు ఎలా ఉంటుంది..? వారు అలా అనుకోవ‌డంలో త‌ప్పేమీ లేదు. అందుకు ప‌లు సంఘ‌ట‌నలే కార‌ణం..!

2008లో స్కార్లెట్ కీలింగ్ అనే 15 ఏళ్ల ఓ బ్రిటిష్ యువ‌తి గోవా బీచ్‌లో అత్యంత దారుణంగా రేప్ చేయ‌బ‌డి చంప‌బ‌డింది. ఆ కేసుకు సంబంధ‌ముంద‌ని అనుమానిస్తూ పోలీసులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు కూడా చేశారు. అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ 2016లో ఆ ఇద్ద‌ర్నీ నిర్దోషులుగా విడిచిపెట్టారు.

2014 జ‌న‌వ‌రిలో ఒకే సారి 3 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అది కూడా వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు తేదీల్లో. ఢిల్లీలోని క‌న్నాట్ ప్లేస్‌లో 52 ఏళ్ల డానిష్ మ‌హిళను 9 మంది గ్యాంగ్ రేప్ చేశారు. అయితే ఆమెకు ఎటు వెళ్లాలో తెలియ‌క పోవ‌డంతో చివ‌ర‌కు వారినే దారి అడిగి వెళ్లిపోయింది. మంగ‌ళూరు నుంచి చెన్నై వెళ్తున్న ట్రెయిన్‌లో 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఓ జ‌ర్మ‌న్ యువ‌తిని కొంద‌రు రేప్ చేశారు. ఆ విష‌యాన్ని ఆమే ట్రెయిన్ దిగాక బ‌యట పెట్టింది. మ‌ధుర – ఢిల్లీ హైవేపై 33 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఓ పోలిష్ మ‌హిళ‌ను క్యాబ్ డ్రైవ‌ర్ రేప్ చేశాడు.

తాజాగా మొన్నీ మ‌ధ్యే జ‌రిగిన హోలీ అనంత‌రం గోవాలో డానియెల్ మెక్‌లాఫ్లిన్ అనే ఓ 28 ఏళ్ల ఐరిష్ మ‌హిళ‌ను కొంద‌రు వ్య‌క్తులు దారుణంగా రేప్ చేశారు. అనంత‌రం ఆమె త‌ల‌పై బీరు బాటిల్‌తో మోది హ‌త్య చేశారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది విదేశీ మ‌హిళ‌లు ఇండియాలో తిర‌గాలంటేనే జంకుతున్న‌ట్టు ప‌లు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు రాశాయి. అవును మరి నిజ‌మే క‌దా. మ‌న దేశంలోనే మ‌హిళ‌ల‌కు స‌రిగ్గా ర‌క్ష‌ణ లేదు, ఎన్ని చ‌ట్టాలు ఉన్నా, శిక్షలు ఉన్నా వారిపై దాడులు ఆగ‌డం లేదు. సెక‌నుకో దాడి, అఘాయిత్యం జ‌రుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో విదేశీ మ‌హిళలు అలా ఆలోచిస్తున్నారంటే అది క‌రెక్టే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top