ఓ ఫోటో…ఆ అమ్మాయి జీవితాన్నే మార్చింది. పాపను వెతుక్కుంటూ ఫారెన్ నుండి వచ్చారు.!!

ఫారెన్ నుండి ఇండియా వచ్చిన డిక్ స్మిత్  ఒకరోజు రైళ్లో ప్రయాణం చేస్తూ ఫ్లై ఓవర్ కింద నివాసముంటున్న కుటుంబంలో క్యూట్ గా ఉన్న చిన్న పాపను ఫోటో తీసి, దానిని తన ఫేస్ బుక్ ప్రొపైల్ గా పెట్టుకున్నాడు. ఫేస్ బుక్ లో అతని ఫ్రెండ్ అయినా  క్రిస్ బే  దీనిని చూసి ఎలాగైనా ఆ పాపకు సహాయం చెయ్యాలనుకున్నారు . వెంటనే భార్య  జెస్ తో కలిసి సిడ్నీ నుండి ఇండియాకు బయలు దేరాడు. 125కోట్ల మంది ఉన్న భారత జనాభాలో ఓ ఫోటో ఆధారంగా పాప ఆచూకీ కనిపెట్టాలి ఇది చాలాకష్టతరం అందులోనూ పాప  ఫోటోను వెనుక నుండి తీశారు. వారికున్న ఆధారం ఒక్క గులాబీ రంగులో పాప చేతికున్న గాజులు మాత్రమే.

724321239

అందుకే ఇండియా దిగి దిగగ్గానే భాషపరమైన ఇబ్బందులను అదిగమించుకోడానికి జయతి అనే ఓ ట్రాన్స్ లేటర్ ను నియమించుకున్నారు. ఆ ఫోటో పట్టుకొని ప్రతి ఒక్కరినీ అడగటం మొదలుపెట్టారు. ఎన్ని రోజులైనా సరే ఆ చిన్నారి ఫ్యామిలీని చేరుకోవాలనేది ఆ దంపతుల అంతిమ లక్ష్యం. ఎన్నోవ్యయ ప్రయాసలకోర్చి చివరకు అలహాబాద్ లోని పాలిటెక్నిక్ (శాస్త్రి బ్రిడ్జి) బ్రిడ్జి వద్ద పాప కుటుండం ఉన్నట్లుగా గుర్తించారు.

700971585
ఆ కుటుంబం దగ్గరికి వచ్చి ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని చూడాలని చెప్పారు క్రిస్, జెస్. వారిని చూసిన ఆ చిన్నారి భయంతో వాళ్ళ అమ్మ చాటున దాక్కుంది. మేం వచ్చింది నీకోసమే, నిన్ను చదివిస్తాం, నీకు ఏం కావాలన్నా సరే కొనిస్తామని నీ పేరేంటి అని వారు అడగ్గా, దివ్య నాయి చాటు నుండే సమాధానం ఇచ్చింది 8 ఏళ్ళ ఆ చిన్నారి. మేం మీపాపకు చదువు చెప్పించడానికి వచ్చాం, ఆమెకు అయ్యే ఖర్చును మేమిస్తాం.. దివ్యను బాగా చదివించిండని,అక్కడి లోకల్ బ్యాంకులో దివ్య పేరు మీదట, ఆ చిన్నారి తల్లి గార్డియన్ గా ఉంచి ఆ అకౌంట్ లో ఆమె చదువుకు కావాల్సిన డబ్బును అందించారు. ప్రతి నెలా దివ్య చదువుకు,ఆమె ఖర్చులకు కావాల్సిన డబ్బును డిక్ స్మిత్ డిపాజిట్ చేస్తాడని తెలిపారు. అవన్నీపూర్తయిన తర్వాత అందరూ ఆటోలో కలిసి షాపింగ్ కు వెళ్లి, అటునుండి రెస్టారెంట్ క్కు వెళ్లి మంచి భోజనం చేశారు. ఎక్కడో ఉన్న మమ్మల్ని, ఎక్కడ నుండో వచ్చి ఇలా సాయం చేసినందుకు దివ్య తల్లిదండ్రులు క్రిస్, జెస్ మరియు డిక్ స్మిత్  లకు కృతజ్ఞతలు తెలిపారు
.
195701028
మన చుట్టూ ఉన్న వాళ్ళకు సహాయం చేయాలంటేనే వంద రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది వారెవరో కూడా తెలీకుండా వారికి సహాయం చేయడానికి వచ్చిన వారి గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదా.

Comments

comments

Share this post

scroll to top