వ‌క్షోజాలు ఎల్ల‌ప్పుడూ సౌంద‌ర్యంగా క‌నిపించాలంటే ఈ సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రి..!

స్త్రీల‌కు వ‌క్షోజాలు అనేవి ఏ ఆకారంలో ఉన్నా, ఏ సైజ్‌లో ఉన్నా అవి బిగుతుగా ఉండాల‌నే కోరుకుంటారు. ఎవ‌రూ జారిపోయిన‌ట్టుగా ఉండాల‌ని ఆశించ‌రు. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌యినా కొంద‌రు స్త్రీల‌లో వ‌క్షోజాలు త్వ‌ర‌గా సాగిపోయిన‌ట్టు అయి అంద విహీనంగా క‌నిపిస్తుంటాయి. ఇది వారికే కాదు, చూసే వారికే ఇబ్బంది క‌రంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో వ‌క్షోజాలు ఎల్ల‌ప్పుడు బిగుతుగా ఉండాల‌న్నా, అందంగా క‌నిపించాల‌న్నా… అందుకు కొన్ని సూచ‌న‌లు పాటించాలి. అవేమిటంటే…

healthy-breasts
1. ఒక‌ప్పుడంటే కాదు కానీ… ఇప్పుడు చాలా మంది స్త్రీలు బ్రాల‌ను ధ‌రిస్తున్నారు. కాలేజీకి వెళ్లే యువ‌తులు కూడా వీరిలో ఉన్నారు. అయితే ఎలాంటి బ్రా ధ‌రించినా స‌రైన సైజ్‌ను ఎంపిక‌చేసుకున ధ‌రించాలి. లేదంటే స్త‌నాలు షేప్ అవుట్ అయిపోతాయి. కొద్ది రోజుల‌కు పైన చెప్పాం క‌దా..! అలా త‌యార‌వుతాయి. క‌నుక బ్రా ఎంపిక‌లో స‌రైన సైజ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

2. కొంద‌రు స్త్రీల‌కు బోర్లా ప‌డుకోవ‌డం అల‌వాటు. అయితే అలా ప‌డుకుంటే వక్షోజాలు ఒత్తిడికి గురై షేప్ అవుట్ అవుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక బోర్లా కాకుండా వేరే దిక్కుగా ప‌డుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. దీంతో వ‌క్షోజాల‌ను సంర‌క్షించుకోవ‌చ్చు.

3. న‌డిచిన‌ప్పుడు లేదా కూర్చున్న‌ప్పుడు ఛాతీ భాగం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వంగిన‌ట్టు ఆ భాగం పెడితే దాంతో వ‌క్షోజాలు కూడా కింద‌కు వేలాడేందుకు అవ‌కాశం ఉంటుంది. అది దీర్ఘ‌కాలికంగా వాటిని షేప్ అవుట్ అయ్యేలా చేస్తుంది.

4. ఒకేసారి త్వ‌ర‌గా బ‌రువు పెరిగినా లేదంటే త‌గ్గినా అది వ‌క్షోజాల ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది. క‌నుక స‌రైన డైట్ పాటించి క్ర‌మ‌బ‌ద్దంగా బ‌రువు పెర‌గ‌డ‌మో, త‌గ్గ‌డ‌మో చేయాలి.

5. స్త‌నాల‌ను రోజూ కొంత సేపు వృత్తాకారంలో మ‌సాజ్ చేస్తే కొద్ది రోజుల‌కు అవి చ‌క్క‌ని ఆకారాన్ని పొందుతాయ‌ని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. క‌నుక అలాంటి ప‌ద్ధ‌తి ట్రై చేయ‌డం ఉత్త‌మం.

6. నిత్యం జిమ్‌, వ్యాయామం చేసే స్త్రీలైతే క‌చ్చితంగా స్పోర్ట్స్ బ్రా ధ‌రించి వాటిని ఆచ‌రించాలి. ఈ సంద‌ర్భంలో పుష‌ప్స్, పులోవ‌ర్స్‌, యోగా వంటివి చేస్తే ఇంకా ఫ‌లితం ఉంటుంది.

7. మ‌ద్యం మానేయాలి. మ‌ద్యం ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల స్త్రీ శ‌రీరంలో ఈస్ట్రోజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయి. అది వ‌క్షోజాల‌పై ప్ర‌భావం చూపుతుంది. క‌నుక ఆల్క‌హాల్‌కు దూరంగా ఉంటేనే మంచిది.

8. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, బ్ర‌కోలి, మొల‌కెత్తిన గింజ‌లు, క్యాబేజీ, ఆలివ్ ఆయిల్‌, వాల్ న‌ట్స్‌, ప్ల‌మ్స్‌, పీచెస్ వంటి కూర‌గాయ‌లు పండ్ల‌ను  ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ఓవ‌రాల్‌గా శ‌రీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Comments

comments

Share this post

scroll to top