మన భారాన్నంతా మోస్తున్న పాదాలను ..మనమెలా చూసుకోవాలి.?

మనం ప్రతిరోజూ ఎంతోకొంత దూరం నడుస్తూ ఉంటాం. ఆ భారం అంతా మన పాదాలపై పడుతుంది. ఒకరోజంతా నడవడం చేస్తే వందటన్నుల భారం మన పాదాలపై పడినట్లుగా ఉంటుంది. మరి ఇంతటి భారాన్ని మోస్తున్న వాటికి విశ్రాంతినిచ్చి, వాటి రక్తప్రసరణ సరిగ్గా అయ్యేలా చూడాలి. అందుకే చైనీస్ మరియు ఈజిప్షియన్లు ఎక్కువగా నడిచిన పాదాలకు జీవన ప్రక్రియ సరిగ్గా జరగాలంటే  విశ్రాంతిని ఇవ్వడం మంచిదని పాద అసంకల్పిత శాస్త్రములో  చెబుతున్నారు.

పాదాలను యాక్టివ్ గా ఉంచడం కోసం ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.
1. చేతి బొటనవేలితో :
అరికాలుపై మీ చేతి బొటనవేలును పైకి కిందకి నొక్కుతూ మర్దనా చేయాలి.
2. కాలివేళ్ళపై మర్దనా:
చాలా దూరం నడచినప్పుడు చాలా మందికి కాలి వేళ్ళు లాగడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చేతి వేళ్ళ ద్వారా కాలి వేళ్ళపై సున్నితంగా పైకి కిందకు మర్దనా చేయాలి.
 iflvf08v8yztjf5wtlzx
3. కాలి పై భాగాన్ని సున్నింతంగా ప్రెస్ చేస్తూ మెల్లిగా రొటేట్ చేయడం.
మన నడక ఎక్కువ భాగం కాలి వేళ్ళ ముందు భాగంపై ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ భాగంలో కాలి మడమను అటూ ఇటూ తిప్పుతూ బొటనవేలితో నొక్కుతూ ఉండాలి.
4. కాలి మధ్య భాగంలో:
పాదం కింద మధ్యభాగం మరీ సున్నితంగా ఉండటం వలన కొంచెం నొప్పి ఎక్కువ కలిగినట్లు ఉంటుంది. అలాంటపుడు ఆ భాగంలో కింద నుండి పైకి బొటనవేలుతో గట్టిగా నొక్కి పట్టుకొని చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం పాదాల గుండా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
kfzq7keho9j6sqd40xm8
పాదాలను మర్దనా చేయడం వలన శరీరంలో ఏయే భాగాలలో ప్రయోజనం కలుగుతుంది:
కళ్ళు, సైనస్, చెవి, భుజం నొప్పి, పిత్తాశయం, కాలేయం, పెద్ద ప్రేగు, కిడ్నీ, అపెండిక్స్,ముక్కు, వీపు భాగం, మెదడు, గుండె, ప్లీహము, మోకాలు, ముడ్డి, క్లోమము, థైరాయిడ్, ఉదర కూటము,మూత్ర నాళము, కాల్షియం స్థాయిని క్రమపరిచే హార్మోనులను విడుదల చేయుగ్రంధి, ఆంత్రమూలం వంటి సమస్యలు పాదాలను మర్దనా చేసే టెక్నిక్స్  ఫాలో అవడం వలన ఈ సమస్యలు దూరమవుతాయి.
szpo69xxngbulydq9zmn
Watch Video For More Info:

Comments

comments

Share this post

scroll to top