ఈ 7 ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉండాలంటే…ఏటువంటి ఆహార ప‌దార్థాలు తినాలో తెలుసా? ఇదిగో లిస్ట్.

మూత్రాశ‌యం… ఊపిరితిత్తులు… మెద‌డు… రొమ్ములు… అండాశ‌యం… ఎముక‌లు… ర‌క్తం… ఇలా శ‌రీరంలో ఏ భాగానికైనా క్యాన్స‌ర్ సోక‌వ‌చ్చు. అది ఎవ‌రికి, ఎప్పుడు, ఎలా వ‌స్తుందో చెప్ప‌లేం. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒక‌సారి ఏదైనా క్యాన్స‌ర్ వ‌స్తే గ‌న‌క దాన్ని ఆరంభంలో గుర్తిస్తేనే స‌రైన చికిత్స చేయ‌వ‌చ్చు. లేదంటే ఆ త‌రువాత దాని గురించి తెలిసినా పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అప్పుడిక చేసేదేం ఉండ‌దు. అయితే ఎలాంటి క్యాన్స‌ర్ అయినా… ఆ వ్యాధి ముప్పు మ‌న‌కు రాకుండా ఉండాలంటే… కింద ఇచ్చిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను మ‌నం త‌ర‌చూ తీసుకుంటూ ఉండాల్సిందే… ఇవి త‌ర‌చూ మ‌న ఆహారంలో భాగం కావ‌ల్సిందే. అప్పుడే క్యాన్స‌ర్ ముప్పు క‌ల‌గ‌కుండా ఉంటుంది. అయితే ఇప్ప‌టికే క్యాన్స‌ర్‌తో బాధ ప‌డుతున్న వారు కూడా ఈ ఆహార ప‌దార్థాల‌ను తిన‌వ‌చ్చు. దాంతో వ్యాధిని కొంత వ‌ర‌కు త‌గ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

cancer-foods

ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌…
ట‌మాటా, గ్రీన్ టీ, కాలీ ఫ్ల‌వ‌ర్‌, బ్ర‌కోలి, క్యాబేజీ, క్యార‌ట్స్‌, పుట్ట గొడుగులు, దానిమ్మ‌, ద్రాక్ష‌, నారింజ‌, నిమ్మ‌, యాపిల్స్‌, బెర్రీ పండ్లు, బ్రౌన్ రైస్‌, ఓట్ మీల్ వంటి ఆహార ప‌దార్థాల‌ను తింటే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాదు. ఆయా ప‌దార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటాయి.

బోన్ క్యాన్స‌ర్‌…
చేప‌లు, గుడ్లు, పాలు, పాల సంబంధ ఉత్ప‌త్తులు, మ‌ట‌న్‌, చికెన్‌, బీన్స్‌, న‌ట్స్ వంటివి ఎక్కువ‌గా తింటే బోన్ క్యాన్స‌ర్ రాదు. ఈ ఆహార ప‌దార్థాల‌ను త‌ర‌చూ తింటుంటే బోన్ క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

బ్రెయిన్ క్యాన్స‌ర్‌…
వెల్లుల్లి, వాల్‌నట్స్‌, చిల‌గ‌డ దుంపలు, అవ‌కాడోలు, గ్రీన్ టీ, బ్ర‌కోలి, బాదం పప్పు, బ్రౌన్ రైస్‌, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, డార్క్ చాకొలేట్ వంటివి మెద‌డు క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెద‌డు క్యాన్స‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి.

నోటి క్యాన్స‌ర్‌…
బొప్పాయి, క్యారెట్‌, మామిడి పండు, పుచ్చ‌కాయ‌, పాల‌కూర‌, క్యారెట్లు, ఆలుగ‌డ్డ‌లు, అవ‌కాడోలు, అర‌టి పండ్లు వంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నోటి క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు. వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల నోటి క్యాన్స‌ర్ ఉన్నా దాని ల‌క్ష‌ణాల‌ను కొంత మేర త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

కిడ్నీ క్యాన్స‌ర్‌…
చిరు ధాన్యాలు, బ‌ఠాణీలు, చిక్కుడు జాతికి చెందిన గింజ‌లు, గోధుమ‌లు, బ్రౌన్ రైస్‌, ఓట్ మీల్‌, మాంసం, పాలు త‌దిత‌ర ప‌దార్థాల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే కిడ్నీ క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది. వీటి వ‌ల్ల శ‌రీరంలోకి చేరే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ ముప్పు నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి.

లివ‌ర్ క్యాన్సర్…
బాదం ప‌ప్పు, చికెన్‌, ఫిష్‌, గుడ్లు, పాలు, పెరుగు, న‌ట్స్‌, బీన్స్‌, సోయా, ఓట్‌మీల్‌, బ్రౌన్ రైస్ వంటి ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ క్యాన్స‌ర్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఈ వ్యాధి బారిన ప‌డ్డ‌వారు ముందు చెప్పిన ఆహార ప‌దార్థాల‌ను తింటే దాంతో కొంత మేర వ్యాధి ల‌క్ష‌ణాల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

బ్రెస్ట్ క్యాన్సర్‌…
క్యారెట్‌, గ్రీన్ టీ, పాల‌కూర‌, పుట్ట గొడుగులు, ఉల్లిపాయ‌లు, ట‌మాటోలు, బ్ర‌కోలి, క్యాబేజీ వంటి ఆహార ప‌దార్థాల‌ను తర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల రొమ్ము క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఆ క్యాన్సర్ వచ్చే ముప్పు గ‌ణ‌నీయంగా తగ్గ‌తుంద‌ని ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

పైన పేర్కొన్న‌వే కాకుండా ఇంకా ఇత‌ర క్యాన్స‌ర్‌లు కూడా ఉన్నాయి. అయితే ఏ క్యాన్స‌ర్ ఉన్నా ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, తృణ ధాన్యాలు, చిక్కుడు జాతి గింజ‌లు, న‌ట్స్ వంటి ఆహార ప‌దార్థాల‌ను మాత్రం క‌చ్చితంగా డైట్ మెనూలో చేర్చుకోవాల్సిందే. దీంతో ఆయా ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top