ఈ నిబంధనలు పాటిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా మీకు నెల నెలా వెయ్యి రూపాయలు

ఈ నిబంధనలు పాటించారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా మీకు నెల నెలా వెయ్యి రూపాయలు మీ అకౌంట్ లో చేరిపోతాయి. అది ఎలాగంటారా.. తెలుసుకోవాలంటే మీరు ఈ ఆర్టికల్ శ్రద్దగా చదవాల్సిందే. తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో లో ఉంచిన విధంగా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించారు .

ఈ పధకం క్రింద అర్హులైన నిరుద్యోగికి నెలకు వెయ్యి రూపాయలు ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద చెల్లించ నుండి.పూర్తి వివరాలను నిరుద్యోగులు వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. 22 నుండి 35 సంవత్సరాల వయస్సు లోపుగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతీ యువకులు ప్రాధమికంగా ఈ పథకానికి అర్హులు. డిగ్రీ లేదా పాలిటెక్నిక్ చేసి ఉండి దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారు మాత్రమే ఈ పధకానికి అర్హులు . రెండున్నర ఎకరాల మాగాణి ,5 ఎకరాల మెట్ట కన్నా భూమి వున్న వారు, ఏదేని వాహనం వున్నవారు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్నవారు, ఏదేని ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా లబ్ది పొంది వ్యాపారం చేస్తున్న వారు ఈ పధకానికి అర్హులు కారు. అక్టోబర్ 2నుండి పథకం ద్వారా ఎంపికైన నిరుద్యోగులు లబ్ది పొందుతారు. వెబ్ సైట్ లో తప్పని సరిగా ఆధార్, ఓటర్ కార్డు ,విద్యార్హత వివరాలు అప్లోడ్ చెయ్యవలసి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top