శ‌రీరంలో నెగెటివ్ ఎన‌ర్జీ పోవాలంటే స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌లు పాటించాలి..!

నిత్యం స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచ‌డ‌మే కాదు, మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఆరోగ్య ప‌రంగా లాభాలు క‌ల‌గ‌డ‌మే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం దేహానికి పాజిటివ్ ఎన‌ర్జీ ల‌భిస్తుంద‌ట‌. దాంతో అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

bathing-negative-energy

1. స్నానం చేసే ముందు నీటిలో కొన్ని న‌ల్ల నువ్వుల‌ను క‌లపాలి. అనంత‌రం 5 నిమిషాలు ఆగి ఆ నీటితో స్నానం చేయాలి. దీని వ‌ల్ల ఒంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వ‌స్తుంది. దాంతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

2. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు ముందుగా నీటిని త‌ల‌పై పోసుకోవాలి. ఆ త‌రువాతే కింద భాగంపై నీరు పోయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒంట్లో ఉన్న విష ప‌దార్థాలు పోవ‌డ‌మే కాదు, శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది. చ‌ల‌వ చేకూరుతుంది.

3. ఇప్పుడంటే ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మంది లేటుగా నిద్ర‌లేచి ఎప్పుడో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు స్నానం చేస్తున్నారు. కొంద‌రైతే ఉద‌యం అంతా మానేసి ఏకంగా రాత్రి పూట స్నానం చేస్తున్నారు. అయితే అలా చేయ‌కూడ‌ద‌ట‌. వేకువ జామునే అంటే… సూర్యుడు ఉద‌యించ‌డానికి ముందే త‌ల‌స్నానం చేస్తే చాలా మంచిద‌ట‌. అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట‌.

4. స్నానం చేసేట‌ప్పుడు బాత్ రూం పాట‌లు కాకుండా ఓం హ్రీం శ్రీం అనే మంత్రం జ‌పిస్తూ ఉంటే ఇంకా మంచిద‌ట‌. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయ‌ట‌.

5. స్నానం చేయ‌డానికి అర‌గంట ముందు ఫుల్ బాడీ మ‌సాజ్ చేసుకోవాలి. దీంతో శ‌రీరంలో ఉన్న అన్ని అవ‌య‌వాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే పోతాయి.

6. స్నానం చేయడానికి ముందు వాక్సింగ్‌, షేవింగ్ వంటివి చేయ‌రాదు. అలా చేస్తే చ‌ర్మం పాడ‌వుతుంది. రంధ్రాలు ప‌డ‌తాయి. స్కిన్ డ్రైగా మారుతుంది.

7. వ్యాయామం చేసిన వెంట‌నే స్నానం చేయ‌రాదు. కొంత సేపు విరామం ఇచ్చాక స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు రావు.

8. ఏవైనా న‌దుల్లో స్నానం చేసేట‌ప్పుడు వాటిలోకి దిగేముందు ఓం అని అనుకోవాలి. ఇలా చేయ‌డం చాలా మంచిది.

9. గంగ చ య‌మున చైవ గోదావ‌రి స‌ర‌స్వ‌తి, న‌ర్మ‌ద సింధు కావేరి జ‌లేస్మిం స‌న్నిధిం కురు అనే మంత్రాన్ని స్నానం చేసేట‌ప్పుడు జ‌పించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆయా న‌దుల రూపంలో ఉన్న దేవ‌త‌ల ఆశీస్సులు ల‌భిస్తాయ‌ట‌. అవి మ‌న‌కు చాలా మేలు చేస్తాయ‌ట‌.

Comments

comments

Share this post

scroll to top