ఈ టిప్స్ పాటిస్తే వ‌ర్షాకాలంలో వ‌చ్చే ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు తెలుసా..?

బ‌య‌ట హోరున వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు ఇంట్లో ఉండి ఎంచ‌క్కా వేడి వేడి చిరుతిండి తింటూ చాయ్ తాగుతూ బ‌య‌టి వ‌ర్షాన్ని చూస్తుంటే ఎంతో మ‌జాగా ఉంటుంది క‌దూ..! అవును, అలాంటి వాతావ‌ర‌ణాన్ని వీక్షించ‌డం ఎవ‌రికైనా ఇష్ట‌మే. అదే అలాంటి వాతావ‌ర‌ణంలో బ‌య‌ట తిర‌గాలంటే ఎవ‌రికైనా ఇబ్బందే. దుస్తులు తడిసిపోతాయి. ఎక్కువ సేపు ఉంటే పూర్తిగా త‌డుస్తారు. త‌రువాత జ‌లుబు, జ్వ‌రం వ‌స్తాయి. ఇక వ‌ర్షంలో త‌డిసిన షూ, సాక్సులు, దుస్తులు ఓ ప‌ట్టాన ఆర‌వు. అయితే వ‌ర్షాకాలంలో ఇలా ఎవ‌రికైనా క‌లిగే ఇబ్బందులు స‌హ‌జ‌మే. కానీ.. కింద చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తే దాంతో వ‌ర్షాకాలంలో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. అవేమిటంటే…

1. bee wax అంటే.. తేనెటీగ‌ల తెట్టె నుంచి తయారు చేసే ఓ ర‌క‌మైన వ్యాక్స్ అన్న‌మాట‌. ఇది మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది. దీన్ని షూస్‌కు బాగా పాలిష్ చేసి, ఎయిర్ బ్లో చేయాలి. గాలికి బాగా ఆర‌నివ్వాలి. అలా గంట సేపు ఉంచితే చాలు, ఇక ఆ షూస్ వ‌ర్షంలో త‌డిసినా అంత సుల‌భంగా త‌డిని పీల్చుకోవు. ఎక్కువ సేపు డ్రైగా ఉంటాయి.

2. వ‌ర్షం నీటిలో షూస్ బాగా త‌డిస్తే వాటిలోంచి నీటిని వీలైనంత వ‌ర‌కు తీసేసి వాటిలో పాత న్యూస్ పేప‌ర్ల‌ను ఉండ‌ల్లా చేసి పెట్టాలి. దీంతో త‌డిని అవి త్వ‌ర‌గా పీల్చుకుంటాయి. షూస్ పొడిగా మారుతాయి.

3. వ‌ర్షాకాలంలో ఎల్ల‌ప్పుడూ మీ వెంట ప్లాస్టిక్ క‌వ‌ర్లు లేదా జిప్ లాక్ బ్యాగుల‌ను ఉంచుకోండి. వ‌ర్షంలో త‌డుస్తామ‌ని అనుకున్న‌ప్పుడు మీ వ‌ద్ద ఉన్న ఎల‌క్ట్రానిక్ ఐట‌మ్స్ అయిన సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్ వంటి వాటిని అందులో వేస్తే అవి సుర‌క్షితంగా ఉంటాయి.

4. వ‌ర్షంలో పొర‌పాటున ఫోన్ త‌డిస్తే వెంట‌నే హైరానా ప‌డిపోయి దాన్ని పార్ట్‌లుగా విడ‌దీయ‌కండి. అప్పుడు ఏం చేయాలంటే ఒక పాత్రలో కొన్ని బియ్యం పోసి ఆ బియ్యంలో ఫోన్ మునిగిపోయేట్టుగా వేయాలి. అనంత‌రం దాన్ని బియ్యంతో క‌ప్పేయాలి. అలా 2 రోజుల పాటు ఉంచాలి. దీంతో ఫోన్‌లో ఉండే నీరంత‌టినీ బియ్యం గ్ర‌హిస్తుంది. అప్పుడు ఫోన్‌కు ఏమీ కాదు.

5. షూస్ మీద మ‌ర‌క‌లు ప‌డితే పెన్సిల్ ఎరేజ‌ర్‌తో వాటిని సుల‌భంగా తుడిచేయ‌వ‌చ్చు.

6. వ‌ర్షాకాలంలో లెద‌ర్ దుస్తులు బాగా ముడుచుకుపోయి పాడైపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటిని గాలి త‌గిలే ప్ర‌దేశంలో పెడితే మంచిది. దీంతో ఆ దుస్తులు పాడుకావు.

7. వ‌ర్షాకాలంలో ఏ నీరు ప‌డితే ఆ నీరు షూస్‌కు అంటుకుంటుంది క‌నుక షూస్‌పై ఫంగ‌స్‌, బాక్టీరియా, వైర‌స్‌లు పేరుకుపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అలా కాకుండా ఉండాలంటే షూస్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌బ్బు నీటితో క‌డ‌గాలి. పాడ‌వుతాయ‌నుకుంటే క‌నీసం స‌బ్బు నీటిలో టూత్‌బ్ర‌ష్‌ను ముంచి అయినా శుభ్రం చేయాలి. లేదంటే క్రిములు షూస్‌ను అంటి పెట్టుకుని మ‌న‌కు వ్యాధుల‌ను తెచ్చి పెడ‌తాయి.

8. జాలిల‌తో ఉండే మెష్ పేప‌ర్‌లో రాక్ సాల్ట్‌ను చుట్టి ఇంట్లో ఓ మూల పెట్టాలి. దీంతో వ‌ర్షాకాలంలో స‌హ‌జంగా ఇంట్లో నుంచి వ‌చ్చే దుర్వాస‌న పోతుంది.

9. వ‌ర్షాకాలంలో దుస్తులు అదో ర‌కమైన వాస‌న వస్తాయి. దీన్ని నివారించాలంటే దుస్తుల‌ను ఉతికేట‌ప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్టెన‌ర్‌ను వాడాలి. ఇలా చేస్తే దుస్తులు సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి.

Comments

comments

Share this post

scroll to top