డ‌బుల్ చిన్ (గ‌డ్డం ఎక్కువ‌గా ఉండడం) స‌మ‌స్య ఉందా..? అయితే ఇలా చేయండి..!

ఆడైనా, మ‌గైనా ముఖం అందంగా క‌నిపించాలంటే అందులో అన్ని భాగాలు స‌రిగ్గా ఉండాల్సిందే. ఏ భాగం స‌రిగ్గా లేక‌పోయినా ముఖం చూడడానికి బాగోదు. ఈ క్ర‌మంలో ద‌వ‌డ కింద ఉండే గ‌డ్డం కూడా ముఖం అందంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. సాధార‌ణ గ‌డ్డం అయితే ఫ‌ర్వాలేదు కానీ కొంద‌రికి డ‌బుల్ చిన్ ఉంటుంది. అంటే గ‌డ్డం కింద ఇంకో గ‌డ్డం రెండుగా ఉంటుంది. కొందరికి అది సాగిన‌ట్టుగా పెద్ద‌గా కూడా ఉంటుంది. ఇలా ఉంటే చూసేందుకు అంత బాగా అనిపించ‌దు. ఈ క్ర‌మంలో కొంద‌రు డ‌బుల్ చిన్ ఉండ‌కుండా స‌ర్జ‌రీ చేయించుకుంటారు కూడా. అయితే అలాంటి బాధ లేకుండా కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే చాలు డ‌బుల్ చిన్ ను దూరం చేసుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

double-chin

షుగ‌ర్ ఫ్రీ చ్యూయింగ్ గ‌మ్స్‌…
చ్యూయింగ్ గ‌మ్స్ న‌మ‌ల‌డం వ‌ల్ల నోరు మొత్తానికి, ద‌వ‌డ‌ల‌కు మంచి వ్యాయామం జ‌రుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే సాధార‌ణ చ్యూయింగ్ గ‌మ్స్ కాకుండా షుగ‌ర్ ఫ్రీ చ్యూయింగ్ గ‌మ్స్ న‌మలాలి. రోజుకు క‌నీసం 4,5 సార్ల‌యినా అలా చ్యూయింగ్ గ‌మ్ న‌మిలితే కొద్ది రోజుల్లోనే డ‌బుల్ చిన్ స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు. పైగా షుగ‌ర్ ఫ్రీ చ్యూయింగ్ గ‌మ్స్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అద‌న‌పు క్యాల‌రీలు కూడా చేర‌వు.

కోకోవా బ‌ట‌ర్‌…
కొద్దిగా కోకోవా బ‌ట‌ర్‌ను తీసుకుని పెనంపై వేడి చేయాలి. దాన్ని మెడ‌, గ‌డ్డం భాగాల‌పై మ‌సాజ్ చేస్తూ రాయాలి. ఇలా క‌నీసం రోజుకు రెండు సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

వీట్ జెర్మ్ ఆయిల్‌…
వీట్ జెర్మ్ ఆయిల్ (మార్కెట్‌లో దొర‌కుతుంది) ను తెచ్చుకుని కొద్దిగా ఆ ఆయిల్‌ను తీసుకుని మెడ‌, గ‌డ్డం భాగాల‌పై రోజుకొక‌సారి 15 నుంచి 20 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వల్ల అధికంగా ఉన్న గ‌డ్డం మాయ‌మ‌వుతుంది.

గ్లిజ‌రిన్…
ఒక టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, అర టేబుల్ స్పూన్ ఎప్సం సాల్ట్‌, కొన్ని చుక్క‌ల పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌ల‌ను తీసుకుని బాగా క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని కాట‌న్ బాల్స్ స‌హాయంతో డ‌బుల్ చిన్‌పై అప్లై చేయాలి. ఇలా వారానికి 3 నుంచి 5 సార్లు చేయవ‌చ్చు. దీంతో డ‌బుల్ చిన్ పోతుంది.

గ్రీన్ టీ…
అధికంగా ఉన్న బ‌రువును, కొవ్వును క‌రిగించ‌డంలోనే కాదు గ్రీన్ టీ డ‌బుల్ చిన్‌ను కూడా దూరం చేస్తుంది. నిత్యం ఒక క‌ప్పు గ్రీన్ టీని తాగుతుంటే దాంతో కొన్ని రోజుల్లోనే డ‌బుల్ చిన్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

విట‌మిన్ ఇ…
బాదంపప్పు, గుడ్లు, వాల్‌న‌ట్స్‌, ఆలివ్ ఆయిల్‌, కీరా, బేబీ కార్న్‌, పాల‌కూర‌, స్ట్రాబెర్రీలు, మొల‌కెత్తిన గింజ‌లు త‌దిత‌ర ఆహారం నిత్యం తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన అత్యంత కీల‌క విట‌మిన్ ఇ అందుతుంది. దీని వ‌ల్ల డ‌బుల్ చిన్ స‌మ‌స్య ఉండ‌దు.

పాలు…
కొద్దిగా పాల‌ను తీసుకుని మెడ‌, గ‌డ్డం భాగాల‌పై రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే కొద్ది రోజుల్లోనే డ‌బుల్ చిన్ మాయ‌మ‌వుతుంది.

త‌ర‌బూజ‌…
త‌ర‌బూజ పండును తెచ్చి జ్యూస్ చేయాలి. దాన్ని మెడ‌, గ‌డ్డం భాగాల‌పై రాయాలి. అనంత‌రం 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా డ‌బుల్ చిన్ పోతుంది. అయితే త‌ర‌బూజ పండ్ల‌ను ఆహారంగా తీసుకున్నా కూడా ఫ‌లితం క‌నిపిస్తుంది.

పైన చెప్పిన టిప్స్‌తోపాటు కింద వీడియోలో ఉన్న ఓ ఎక్స‌ర్‌సైజ్‌ను నిత్యం 5 నిమిషాల పాటు చేస్తే చాలు. దాంతో డ‌బుల్ చిన్ స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top