పిల్లలను కనాలనే కోరిక ఏ దంపతులకు మాత్రం ఉండదు చెప్పండి..? ఏ జంటైనా తమ ప్రేమానుబంధానికి, ఆత్మీయతకు గుర్తుగా తమ రక్తం పంచుకుని బిడ్డ పుట్టాలనే కోరుకుంటారు. ఆ పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కూడా ఆశిస్తారు. అయితే కొందరు దంపతులకు పెళ్లయి ఎన్ని రోజులు అయినా పిల్లలు పుట్టరు. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలో వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రెగ్నెన్సీ కోసం మందులు వాడడం అంతా సహజమే. పురుషుల్లో లోపం ఉన్నా వారు కూడా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే అలా పిల్లల్ని కనాలని ఎదురు చూసే వారు కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటిస్తే వారికి పిల్లలు త్వరగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలు…
శనగలను ఉడకబెట్టి కానీ, కూరల్లో గానీ వేసుకుని నిత్యం తింటుంటే దాంతో మహిళల్లో అండాశయాల పనితీరు మెరుగు పడుతుంది. ఇది చక్కని రుతు క్రమాన్ని ప్రేరేపిస్తుంది. దీంతో పిల్లలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది.
దానిమ్మపండ్లు…
దానిమ్మ పండ్లలో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరుకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను నిత్యం తినడం వల్ల మహిళల్లో గర్భాశయానికి రక్త సరఫరా పెరుగుతుంది. ఇది రుతుక్రమం సరిగ్గా జరిగేలా ప్రోత్సహిస్తుంది. దీంతో పాటు దానిమ్మ పండ్ల వల్ల పురుషుల్లో వీర్య నాణ్యత పెరుగుతుంది. దీంతో పిల్లల్ని త్వరగా కనేందుకు అవకాశం ఉంటుంది.
ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు…
ఆకుపచ్చగా ఉండే కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తినడం వల్ల దంపతులకు కావల్సిన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి వారిలోని హార్మోన్ అసమతుల్యతలను పోగొడతాయి. దీంతోపాటు ప్రధానంగా మహిళల్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్లను పెంచుతాయి. దీని వల్ల గర్భం కలిగేందుకు చాలా అవకాశం ఉంటుంది. అంతేకాదు గర్భధారణ అనంతరం కూడా మహిళలు ఇలాంటి కూరగాయలను తింటుంటే శిశువు చక్కగా ఎదుగుతుంది.
ఆలివ్ ఆయిల్…
ఆలివ్ ఆయిల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. ప్రధానంగా దంపతులు నిత్యం తమ ఆహారంలో ఆలివ్ ఆయిల్‌ను భాగంగా చేసుకుంటే దాంతో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇది పిల్లల్ని త్వరగా పొందడానికి చక్కని ఉపాయం.
ఐస్ క్రీం…
మహిళలు ఐస్ క్రీంలను ఎక్కువగా తినడం చాలా మంచిదట. ఎందుకంటే వాటిలో ఉండే పలు రకాల పాల సంబంధ పదార్థాల వల్ల కొన్ని ముఖ్యమైన కొవ్వులు శరీరంలోకి చేరుతాయి. ఇవి గర్భం దాల్చడానికి ఉపయోగపడే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. కనుక పెళ్లయిన మహిళలు ఐస్ క్రీంలను ఎక్కువగా తింటే దాంతో గర్భం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గుమ్మడికాయ విత్తనాలు…
గుమ్మడి కాయ విత్తనాలు మనకు బయట మార్కెట్లో లభిస్తాయి. వీటిని నిత్యం తింటుంటే ఐరన్ సమృద్ధిగా అందుతుంది. దాని వల్ల రక్తం పెరగడంతోపాటు లైంగిక పటుత్వం కూడా పెరుగుతుంది. ఇది పిల్లల్ని త్వరగా కనేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పనీర్…
దంపతులు పనీర్‌ను ఎక్కువగా తీసుకుంటున్నా దాంతో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. దీని వల్ల పిల్లలు త్వరగా పుడతారు.
బ్రకోలి…
ఇది మనకు సాధారణంగా బయట దొరకదు. కేవలం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. అయినా దీన్ని తెచ్చుకుని కూర రూపంలో తింటుంటే దాంతో ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలో ఉన్న అసమతుల్యతలను పోగొట్టి ప్రత్యుత్పత్తి అవయవాలను సక్రమంగా పనిచేయించేలా చేస్తాయి.
బాదం పప్పు…
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు బాదం పప్పులో ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రత్యుత్పత్తి అవయవాలకు, హార్మోన్లకు మంచివి. బాదం పప్పును నిత్యం తింటున్నా ఆయా అవయవాలు మంచిగా పనిచేసి దాంతో పిల్లలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది.
మిరపకాయలు…
తినడానికి రుచిలో ఘాటుగా, కారంగా ఉన్నా మిరపకాయల వల్ల కూడా దంపతులకు మేలే జరుగుతుంది. వీటిని తినడం వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల పనితీరు మెరుగు పడుతుంది.
అరటి పండ్లు…
అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల స్త్రీలలో రుతుక్రమ సమస్య తొలగిపోతుంది. పీరియడ్స్ సరిగ్గా వస్తాయి. దీంతో పిల్లలు కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.