ఇలా చేస్తే కేవ‌లం 72 గంట‌ల్లోనే మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి తెలుసా..?

ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా కేవలం 72 గంటల్లోనే శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డెయిరీ ఉత్పత్తులు
పాలు, దాని సంబంధ ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వంటి వాటిని తీసుకోకూడదు. వీటిల్లో ఉండే పలు రకాల పదార్థాల ఊపిరితిత్తులకు హాని చేస్తాయి. వీటిని ఆహారం నుంచి తొలగించడం మంచిది.

2. గ్రీన్ టీ
రోజుకు 2 నుంచి కప్పుల గ్రీన్ టీ తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయి అవి శుభ్రంగా తయారవుతాయి.

3. నిమ్మరసం
ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

4. క్యారెట్ జ్యూస్
ఉదయాన్నే పరగడుపున, మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.

5. పొటాషియం
ఆరెంజ్, అరటిపండు, చిలగడదుంపలు, క్యారెట్లు తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి.

6. అల్లం
ఉదయాన్నే పరగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.

7. పుదీనా
ఉదయాన్నే పరగడుపున 4,5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

8. ఆముదం
కొంత ఆముదం తీసుకుని ఉదయం, సాయంత్రం చాతిపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.

పైన చెప్పిన సూచనల్లో కనీసం 4 సూచనలను 3 రోజుల పాటు పాటిస్తే చాలు, తేడా మీకే తెలుస్తుంది. అయితే ఈ సూచనలను పాటించాలనుకునే వారు పొగ తాగకూడదు, మద్యం సేవించకూడదు.

Comments

comments

Share this post

scroll to top