గ‌రుడ పురాణం ప్ర‌కారం ఈ సూచ‌న‌లు పాటిస్తే మీరు జీవితంలో విజ‌య‌ప‌థంలో దూసుకెళ్తారు..!

గ‌రుడ పురాణం గురించి చాలా మందికి తెలుసు క‌దా. ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీసిన అప‌రిచితుడు సినిమా ఏమో గానీ ఆ పురాణం గురించి చాలా మందికి తెలిసిపోయింది. దీంతో చాలా మంది దాన్ని కొని చ‌దివేందుకు ఆస‌క్తి చూపారు కూడా. అయితే అందులో ఏముంటుందో అంద‌రికీ తెలుసు క‌దా. మ‌నిషి చ‌నిపోయాక ఏమ‌వుతాడు..? అతని ఆత్మ ఎక్క‌డికి వెళ్తుంది..? దానికి ఏమ‌వుతుంది..? న‌ర‌కంలో అత‌నికి ఎలాంటి శిక్ష‌లు వేస్తారు..? వ‌ంటి అంశాలు గ‌రుడ పురాణంలో ఉంటాయి. అయితే ఇవే కాదు, గ‌రుడ పురాణంలో ఇంకా ఇత‌ర అనేక విష‌యాలు ఉంటాయ‌ట తెలుసా..? వాటిలో మ‌న నిత్య జీవితానికి చెందిన కొన్ని ముఖ్య‌మైన సూచ‌న‌లు కూడా ఉన్నాయి. మ‌నం జీవితంలో విజ‌యం సాధించాలంటే ఏం చేయాలో కూడా అందులో ఉంద‌ట‌. ఈ క్ర‌మంలో మ‌న సక్సెస్ కోసం ఉప‌యోగ‌ప‌డే సూచ‌న‌లు అందులో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిత్యం శుభ్ర‌మైన దుస్తుల‌నే ధ‌రించాలి. మురికిగా ఉన్న దుస్తుల‌ను ధ‌రించ‌కూడ‌దు. అలా చేస్తే మ‌న ద‌గ్గ‌ర ల‌క్ష్మీ దేవి ఉండ‌ద‌ట‌. డ‌బ్బు ఇట్టే ఖ‌ర్చ‌వుతుంద‌ట‌. ఎంత సంపాదించినా నిల‌వ‌ద‌ట‌.

2. మ‌న‌కు చ‌క్క‌ని ఆరోగ్యాన్ని, పోష‌కాల‌ను అందించే ఆహారాన్నే తీసుకోవాల‌ట‌. అలా తీసుకుని ఆరోగ్యంగా ఉండాల‌ట‌. అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతూ ఉండేవారు జీవితంలో ముందుకు వెళ్ల‌లేర‌ట‌.

3. నిత్యం క‌చ్చితంగా వ్యాయామం చేయాల‌ట‌. మాన‌సికంగా, శారీర‌కంగా దృఢంగా ఉండాల‌ట‌. అలా ఉంటేనే విజ‌యం ద‌రి చేరుతుంద‌ట‌.

4. స‌మాజంలో ఉన్న తోటి మ‌నుషుల‌కు స‌హాయ ప‌డాల‌ట‌. ఒక‌రు ఎక్కువ‌, ఒకరు త‌క్కువ అనే భావం క‌లిగి ఉండ‌రాద‌ట‌.

ఈ సూచ‌న‌లు పాటించిన వారికి ఎల్ల‌ప్పుడూ విజ‌యం క‌లుగుతుంద‌ని గ‌రుడ పురాణంలో ఉంద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top