ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయా..? ఇలా చేస్తే ఆ స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌..!

డ‌బ్బు అనేది అంద‌రికీ అవ‌స‌ర‌మే. దాంతో ఏ వ్య‌క్తికైనా అనేక అవ‌స‌రాలు తీరుతాయి. అయితే స‌మాజంలో అంద‌రూ డ‌బ్బున వారు మాత్ర‌మే ఉండ‌రు క‌దా. పేద వారు కూడా ఉంటారు. కానీ… డ‌బ్బు త‌గినంత‌గా సంపాదిస్తూ ఉన్నా కూడా కొంద‌రు ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. దీంతోపాటు ఇంకా కొంద‌రికైతే ఎంత ట్రై చేసినా అస‌లు ధ‌నం ల‌భించ‌దు, ఆర్థిక స‌మ‌స్య‌లు విప‌రీతంగా ఉంటాయి. ఈ క్ర‌మంలో ఇలాంటి వారు కింద చెప్పిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో వారికి క‌లిగే ఆర్థిక ఇబ్బందుల‌ను కొంత వ‌ర‌కు అధిగ‌మించ‌వ‌చ్చు. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

economical-problems

1. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్ర‌హాన్ని ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

2. ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ, కుబేరులు లేదా స్వస్థిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది.

3. వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.

4. మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఆ కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది.

5. కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు, అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి. అలాగే కూజా లేదా కుండను తెరచి ఉంచ‌కూడ‌దు, మూతపెట్టుకోవాలి.

6. మెటల్ ఫిఫ్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

7. సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్లందరూ కలకాలం హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వాళ్లందరి ఆదాయం పెరుగుతుంది.

8. మీకు ఒక వేళ షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరంవైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు.

9. షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చి డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది. అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు.

10. మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్య మూలలు అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా, అందంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందుతారు.

11. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ( స్టెయిర్ కేస్ ) ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు. దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది.

12. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ని ఎట్ టిపరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.

13. మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే ఇల్లు పేదరికం, డిప్రెషన్ కి సంకేతం.

14. వాస్తు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది.

15. ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యంపాలవడం, తరచుగా గొడవ పడటం, కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి.

16. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.

Comments

comments

Share this post

scroll to top