ప‌ది మందిలో ప‌రువుతీసే…పిరుదుల దుర‌ద‌ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డం ఎలా?

ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం… చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌డం… అనారోగ్య స‌మ‌స్య‌లు… వంటి వాటి కార‌ణంగా కొంద‌రికి పిరుదులు అప్పుడ‌ప్పుడు దుర‌ద పెడుతుంటాయి. దీంతో చాలా అవ‌స్థ ప‌డాల్సి వ‌స్తుంది. ప్ర‌ధానంగా న‌లుగురిలో ఉన్న‌ప్పుడు పిరుదులు దుర‌ద పెడుతుంటే అదో ర‌క‌మైన ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే అలాంటి అవ‌స్థ ప‌డాల్సిన ప‌నిలేకుండా కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే చాలు. దాంతో పిరుదుల దుర‌ద స‌మ‌స్య‌ను ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

itching-buttocks

1. కొద్దిగా అలోవెరా (క‌ల‌బంద) గుజ్జును తీసుకుని పిరుదులపై రాయాలి. దీంతో దురద స‌మ‌స్య త‌గ్గిపోతుంది. అంతే కాదు, వాపు ఉన్నా త‌గ్గుతుంది. అలోవెరాలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. అందువ‌ల్లే ఆ స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. ఆలుగ‌డ్డ‌ల‌ను అలాగే పేస్ట్‌లా చేసి పిరుదుల‌పై రాయాలి. దీంతో దురద‌, మంట త‌గ్గుతాయి. ఆయా ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించే గుణం ఆలుగ‌డ్డ‌ల్లో ఉంది.

3. క‌మోమిల్ అన‌బ‌డే ఓ ర‌కమైన పువ్వు నుంచి తీసిన ప‌దార్థాలతో టీ త‌యారు చేస్తారు. ఆ టీని తాగితే పిరుదుల దుర‌ద స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో ఉండే దుర‌ద‌లు, వాపులు కూడా దీంతో త‌గ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఈ టీలో పుష్క‌లంగా ఉన్నాయి.

itching-buttocks-2

4. కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను ఆముదం నూనె లేదా బాదం నూనెతో కలిపి మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని పిరుదుల‌పై రాయాలి. ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మంట‌, వాపు కూడా త‌గ్గుతాయి.

5. కొన్ని వెల్లుల్లి రేకులు, బిర్యానీ ఆకుల్ని తీసుకుని నీటిలో బాగా మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిని పిరుదుల‌పై రాయాలి. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శమ‌నం క‌లుగుతుంది.

6. కొద్దిగా కాట‌న్ తీసుకుని దాన్ని యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ లో కొంత సేపు నాన బెట్టాలి. అనంత‌రం ఆ కాట‌న్‌ను పిరుదుల‌పై రాయాలి. ఇలా చేస్తే స‌మ‌స్య తీవ్ర‌త త‌గ్గుతుంది.

7. విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకున్నా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు, గుడ్లు, చేప‌లు వంటివి తింటే పిరుదుల దుర‌ద స‌మ‌స్య త‌గ్గుతుంది.

Comments

comments

Share this post

scroll to top