చాలా మందిని ఇబ్బంది పెట్టే…తొంటి నొప్పికి కరెక్ట్ పరిష్కారం మీకోసం.

కూర్చున్నా, నిల‌బ‌డ్డా, క‌దిలినా తుంటి ద‌గ్గ‌ర విప‌రీత‌మైన నొప్పి. భ‌రించ‌లేనంత బాధ‌. ఆ ప్ర‌దేశంలో సూదుల‌తో గుచ్చిన‌ట్టుగా ఉండ‌డం, స్ప‌ర్శ జ్ఞానం స‌రిగ్గా లేక‌పోవ‌డం… ఇవీ స‌యాటికా నొప్పి ల‌క్ష‌ణాలు. వెన్ను నొప్పిలాగానే ఉంటుంది కానీ ఈ నొప్పి శ‌రీరానికి కేవ‌లం ఒకే వైపు అది కూడా తుంటి ద‌గ్గ‌ర‌, పిరుదుల ద‌గ్గ‌ర ఉంటుంది. ఆ ప్ర‌దేశంలో ఉండే స‌యాటిక్ న‌రం ప‌నితీరులో మార్పు వ‌ల్లే ఈ నొప్పి వ‌స్తుంది. అందుకే దీన్ని స‌యాటికా పెయిన్ అంటారు. నేటి త‌రుణంలో ప్ర‌తి 100 మందిలో 40 శాతం మంది ఈ త‌ర‌హా నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. అయితే అలాంటి వారు వైద్యులు అందించే చికిత్స‌తోపాటు కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే స‌ద‌రు నొప్పి నుంచి కొంత ఉప‌శ‌మ‌నం పొందేందుకు వీలు క‌లుగుతుంది. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

sciatic-nerve

  •  మ‌న శ‌రీరంలో ఉన్న అతి పెద్ద నరాల‌లో స‌యాటిక్ న‌ర్వ్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంది. దీనికి అనేక ర‌కాల చిన్న నాడులు క‌నెక్ట్ అయి ఉంటాయి. వెన్నెముక నుంచి ఈ న‌రం కాలి కింద‌కు వెళ్తుంది. దీనికి సంబంధించిన శాఖ‌లు తొడ‌లు, పిక్క‌లు, పాదాలు, బొట‌న వేలు వ‌ర‌కు విస్త‌రించి ఉంటాయి.
  •  వెన్నెముక‌లో ఉండే కొన్ని ప్రాంతాల్లో స‌యాటిక్ న‌ర్వ్ ఒత్తిడికి గుర‌వుతుంది. దీని వ‌ల్ల ఆ ఒత్తిడికి సంబంధించిన నొప్పి ఆ ప్ర‌దేశం నుంచి కాలి కింది వ‌ర‌కు వ్యాపిస్తుంది. అయితే స‌యాటికా నొప్పి మ‌రీ తీవ్ర‌త‌ర‌మైతే శ‌స్త్ర చికిత్స చేయాల్సి వ‌స్తుంది.pain-1
  • నేల‌పై బోర్లా ప‌డుకుని, చేతుల‌ను నేల‌పై ఆనించి వాటిపై నెమ్మదిగా పైకి లేచి వంగాలి. ఈ భంగిమ‌లో కొంత సేపు ఉండాలి. ఈ క్ర‌మంలోనే త‌ల‌ను కొంత సేపు పైకి, కొంత సేపు కింద‌కి ఉంచి భంగిమ‌ను మార్చాలి. చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా ఈ ఆస‌నం వేస్తే స‌యాటికా నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  • నేల‌పై బోర్లా ప‌డుకుని చేతుల‌ను కింద ఆనిస్తూ కేవ‌లం త‌ల‌, ఛాతి భాగాల‌ను మాత్ర‌మే పైకి లేపి చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా భంగిమ‌ను పెట్టాలి. ఇలా కొంత సేపు ఉండాలి. దీని వ‌ల్ల స‌యాటికా నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే ఈ భంగిమ‌లో ఉన్న‌ప్పుడు నోటిని బాగా వెడ‌ల్పుగా చేసి నాలుక‌ను వీలైనంత వ‌ర‌కు బ‌య‌టికి ఉంచి శ్వాస తీసుకోవాలి.pain-2
  • నొప్పి ఉన్న ప్ర‌దేశంలో ఐస్ ప్యాక్‌ను పెట్టుకుని కొంత సేపు ఉంచాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి. దీని వ‌ల్ల నొప్పి త‌గ్గిపోతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.
  • వెన్నెముక‌పై నెమ్మ‌దిగా మ‌ర్ద‌నా చేస్తూ మ‌సాజ్ చేయాలి. త‌ర‌చూ ఇలా చేయ‌డం వ‌ల్ల స‌యాటికా పెయిన్ నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు.
  • శ‌రీరంలోని ప‌లు నిర్దిష్ట భాగాల్లో ఒత్తిడిని క‌ల‌గ‌జేయ‌డం వ‌ల్ల అనారోగ్యాల‌ను దూరం చేసుకునే ఆక్యుప్రెష‌ర్‌, ఆక్యుపంక్చ‌ర్ వైద్యాల‌ను ప్ర‌య‌త్నించాలి. వీటిని స‌రైన నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినా నొప్పిని కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.
  •  బాగా ఎక్కువ సేపు కూర్చుని లేదా నిలుచుని ప‌నిచేసే వారు మ‌ధ్య మ‌ధ్య‌లో తేలిక‌పాటి వ్యాయామాలు చేయాలి. లేచి అటు, ఇటు న‌డ‌వాలి. నిల్చునే వారైతే కొంత సేపు విరామంగా కూర్చోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఇలా చేసినా నొప్పి త‌గ్గిపోతుంది.
  •  నిత్యం త‌గినంత స‌మ‌యం పాటు నిద్ర పోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ద్రవాలు స‌రైన స్థాయిలోకి వ‌చ్చి నొప్పిని నియంత్రిస్తాయి.

Comments

comments

Share this post

scroll to top