బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..! అయితే ఈ అల‌వాట్ల‌ను కూడా పాటించాల్సిందే..!

జంక్ ఫుడ్ తిన‌క‌పోవ‌డం… నిత్యం స‌రైన వేళ‌కు పౌష్టికాహారం తిన‌డం… రోజూ వ్యాయామం చేయ‌డం….ఇవ‌న్నీ బ‌రువు త‌గ్గించుకునేందుకు ఎవ‌రైనా చేస్తారు. దీంతోపాటు ఇంకా కొంద‌రు గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌ల‌లో గ‌డ‌ప‌డం, యోగా వంటివి కూడా చేస్తారు. అయితే ఇవ‌న్నీ ఓకే. కొద్ది నెల‌లు వీటిని పాటిస్తే ఎవ‌రైనా బ‌రువు త‌గ్గుతారు. ఆరోగ్యం బాగు ప‌డుతుంది. కానీ… వీటితోపాటు ఇప్పుడు చెప్ప‌బోయే కొన్ని అల‌వాట్ల‌ను కూడా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు పాటించాల్సి ఉంటుంది. అలా పాటిస్తేనే అనుకున్న ఫ‌లితం వ‌స్తుంది.ఈ క్ర‌మంలో అలా పాటించాల్సిన అల‌వాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

reduce-overweight

నిద్ర‌…
రోజుకు 6 నుంచి 8 గంట‌ల మ‌ధ్య నిద్ర క‌చ్చితంగా పోవాలి. అలా నిద్ర పోతేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. బ‌రువు అదుపులో కూడా ఉంటుంది. కానీ 6 గంట‌ల కన్నా త‌క్కువ లేదా 8 గంట‌ల క‌న్నా ఎక్కువ‌గా నిద్ర‌పోతే మాత్రం బ‌రువు త‌గ్గ‌క‌పోగా పెరుగుతారు. అందుక‌ని నిత్యం మ‌న‌కు ఎన్ని గంట‌ల నిద్ర అవ‌స‌ర‌మో అన్నే గంట‌లు పోవాలి త‌ప్ప త‌గ్గ‌కూడ‌దు, పెర‌గ‌కూడ‌దు.

సూర్య‌కాంతి…
చాలా మంది ఉద‌యాన్నే లేచి క‌నీసం ర‌వ్వంతైనా సూర్య‌కాంతి కూడా త‌గ‌ల‌కుండానే రెడీ అయి అలాగే కార్ల‌లోనో, బస్సుల్లోనో ఎక్కి వెళ్తుంటారు. అయితే అలా చేయ‌కూడ‌దు. ఉద‌యం కొద్ది సేపు సూర్య‌కాంతి శ‌రీరానికి త‌గ‌లాల‌ట‌. దీంతో శ‌రీర బ‌రువు త‌గ్గుతుంద‌ట‌. ఆ స‌మ‌యంలో సూర్య‌కాంతిలో ఉండే ఓ ర‌క‌మైన నీలి కిర‌ణాలు శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయ‌ట‌.క‌నుక ఉద‌యం కచ్చితంగా సూర్య కిర‌ణాలు త‌గిలేలా కొంత సేపు ఉండాలి.

బెడ్‌…
చాలా మంది బెడ్ పై నుంచి నిద్ర లేవ‌గానే దాన్ని అలాగే వదిలేస్తారు. స‌రి చేయ‌రు. కానీ బెడ్‌ను స‌రిచేస్తే బ‌రువు త‌గ్గుతార‌ట‌. దీన్ని ప‌లువురు సైంటిస్టులు నిరూపించారు కూడా.

బ‌రువు చెకింగ్‌…
రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు క‌చ్చితంగా బ‌రువు చూసుకోవాల‌ట‌. అలా చేస్తే క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతార‌ట‌. దీన్ని కార్నెల్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు నిరూపించారు.

బ్రేక్‌ఫాస్ట్‌…
ఉద‌యం పూట తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ భారీగా ఉండాల‌ట‌. క‌నీసం 600 క్యాల‌రీల‌నైనా ఇచ్చే విధంగా ఉండే ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు క‌లిగిన ఆహారం తినాల‌ట‌. అలా తింటే బ‌రువు త‌గ్గుతార‌ట‌.

Comments

comments

Share this post

scroll to top