చాలా రోజుల నుండి జాబ్ కోసం ట్రై చేసినా రావట్లేదా.? అయితే ఈ 5 సింపుల్ టిప్స్ తప్పక పాటించండి.!

Siva Ram

ఒక‌ప్పుడు ఏమోగానీ నేటి త‌రుణంలో జాబ్ సంపాదించ‌డం చాలా క‌ష్టంగా మారింది. నిరుద్యోగ యువ‌తీ యువ‌కులు ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్ర‌పంచంలో ఉద్యోగం సాధించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. కొంద‌రికైతే అన్ని అర్హ‌త‌లు, కావల్సిన నైపుణ్యాలు అన్నీ ఉంటున్నాయి. కానీ జాబ్ మాత్రం రావ‌డం లేదు. అయితే నేటి ప్ర‌పంచంలో ఎవ‌రికైనా జాబ్ అంత సుల‌భంగా రావాలంటే అందుకు ఎన్నో సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కింద చెప్పిన విష‌యాల‌ను మాత్రం నిరుద్యోగ యువ‌తీ యువ‌కులు కచ్చితంగా గుర్తు పెట్టుకుని పాటించాలి. అప్పుడే కావ‌ల్సిన ఉద్యోగాన్ని త్వ‌ర‌గా సాధించ‌గ‌లుగుతారు. మ‌రి నిరుద్యోగులు పాటించాల్సిన ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఓకే కోర్స్ చ‌ద‌వాలి…
సాధార‌ణంగా చాలా మంది ఇంట్లో వారి బల‌వంతం మేర‌కు ఒక కోర్స్ చ‌దువుతారు. కొంద‌రు ఫ్రెండ్స్ చ‌దువుతున్నారు క‌దా అని చెప్పి వారు చ‌దివే కోర్సును చ‌దువుతారు. ఇక మ‌రికొంద‌రు అయితే అన్ని కోర్సుల‌పై ప‌ట్టు ఉండాల‌నే ఉద్దేశంతో అవ‌స‌రం ఉన్నా లేకున్నా ప్ర‌తి కోర్సును చేస్తూ పోతారు. కానీ నిజానికి ఈ మూడు మార్గాల‌ను అనుస‌రించ‌కూడ‌దు. ఎవ‌రైనా త‌మ‌కు ఇష్ట‌మైన ఒకే కోర్సును ఎంచుకోవాలి. దానిపైనే ధ్యాస పెట్టాలి. అందులో నిపుణ‌త సాధించే వ‌ర‌కు కృషి చేయాలి. అలా చేస్తే జాబ్ త‌ప్ప‌క వ‌స్తుంది. అంతేకానీ ఎవ‌రి బ‌ల‌వంతం మేరకో ఇష్టం లేకున్నా కోర్సుల‌ను చ‌ద‌వ‌కూడ‌దు.

2. మంచి నెట్ వ‌ర్క్ ఉండాలి…
కొంద‌రికి మంచి నైపుణ్యం ఉంటుంది. ఉద్యోగం సాధించేందుకు అన్ని అర్హ‌త‌లు ఉంటాయి. కానీ ఉద్యోగం ఎలా ల‌భిస్తుంది ? దాన్ని ఎలా పొందాలి ? అనే మార్గాలు తెలియ‌వు. క‌నుక అలాంటి వారు త‌మ నెట్‌వ‌ర్క్‌ను పెంచుకుంటూ పోవాలి. కొత్త ప‌రిచ‌యాలు చేసుకోవాలి. చాలా వ‌ర‌కు ఇప్పుడు న‌గ‌రాల్లో వీకెండ్స్‌లో జాబ్ మీట్ అని నిర్వ‌హిస్తున్నారు. వాటికి వెళ్తే కొత్త ప‌రిచ‌యాలు అవుతాయి. జాబ్ అవ‌కాశాలు పెరుగుతాయి. వాటిల్లో నిపుణులు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు ప‌నికొస్తాయి. దీంతో జాబ్‌ను సుల‌భంగా సాధించ‌వ‌చ్చు.

3. ఫేస్‌బుక్‌…
ప్ర‌స్తుత త‌రుణంలో ఫేస్‌బుక్ అనేది కేవ‌లం కాల‌క్షేపం కోసం మాత్ర‌మే కాదు, నిరుద్యోగుల‌కు జాబ్‌ను ఇచ్చే వేదిక‌గా కూడా మారింది. అందులో నిరుద్యోగుల కోసం గ్రూప్‌లు, పేజీలు ఉంటాయి. వాటిని ఫాలో అయితే జాబ్ అవ‌కాశాల గురించి తెలుస్తుంటుంది. దీనికి తోడు మీకు తెలిసిన వారు ఏవైనా కంపెనీల్లో ఉద్యోగం చేస్తుంటే ఆ కంపెనీల్లో ఉండేవారితో ఫేస్ బుక్‌లో సుల‌భంగా క‌నెక్ట్ అయి జాబ్ అవ‌కాశాల‌ను వెద‌క‌వ‌చ్చు. దీంతో జాబ్ త్వ‌ర‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. చాలా వ‌ర‌కు కంపెనీలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా ప్ర‌క‌ట‌నల ద్వారా జాబ్‌ల‌ను అందిస్తున్నాయి.

4. లింక్డిన్…
ఇత‌ర సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌తో పోలిస్తే లింక్డిన్‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇందులో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుంటే ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయి. చాలా కంపెనీలు లింక్డిన్ ద్వారా జాబ్ ల‌ను ప్ర‌క‌టిస్తుంటాయి. క‌నుక ఈ సైట్‌లో వివ‌రాల‌ను న‌మోదు చేసుకుంటే కంపెనీలు మీకు జాబ్ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపిస్తాయి. ఈ క్రమంలో మీకున్న నైపుణ్యాలు, మీ విద్య, ఇతర అర్హతలు, స్కిల్స్‌ అన్నింటినీ లింక్డిన్‌లో నమోదు చేస్తే దాంతో మీకు జాబ్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

5. రెజ్యూమ్‌ వదలి వెళ్లండి… 
ఏదైనా కంపెనీకి ఉద్యోగం కోసం వెళితే అక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవని చెప్పినా సరే మీ రెజ్యూమ్‌ను మాత్రం హెచ్‌ఆర్‌కు ఇవ్వండి. దీంతో భవిష్యత్తులో ఏవైనా రిక్రూట్‌మెంట్లు అయితే అప్పుడు మీకు మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. ఇలా కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలను పెంచుకోవచ్చు.

Comments

comments