ఈ 14 టిప్స్ పాటిస్తే మీ క‌రెంట్ బిల్లును స‌గం వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా..?

ప్రతి నెల 1వ తారీఖు లేదా మొద‌టి వారంలో జీతాలు వ‌చ్చాయంటే చాలు, కిరాణా సామాను మొద‌లుకొని అనేక బిల్లుల‌ను ప్ర‌జ‌లు క‌ట్టాల్సి ఉంటుంది. వాటిల్లో క‌రెంటు బిల్లు కూడా ఒక‌టి. సాధార‌ణ బిల్లు వ‌స్తే ఏమీ కాదు, కానీ అలా కాకుంగా షాక్ క‌లిగించేలా బిల్లు వ‌స్తేనే అప్పుడు ఆందోళ‌న చెందుతారు. ఇక కొంద‌రైతే తాము ఎంత ఆదా చేయాల‌ని చూసినా క‌రెంట్ అధికంగా ఖ‌ర్చ‌వుతుంద‌ని, బిల్లు బాగా వ‌స్తుంద‌ని ఆవేద‌న చెందుతుంటారు. అయితే అలా బాధ ప‌డ‌కుండా కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు ఓసారి పాటించి చూడండి. దీంతో మీ క‌రెంటు బిల్లు బాగా త‌క్కువ‌గా వ‌స్తుంది. ఆ సూచ‌న‌లు ఏమిటంటే…

1. ఏసీల‌ను వాడేవారు ప్ర‌తి నెలా ఎయిర్ ఫిల్ట‌ర్‌ను క్లీన్ చేయాలి. ఏసీ ఆన్‌లో ఉన్న‌ప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ చేయాలి. డోర్ క‌ర్ట‌న్లు వాడాలి. రూమ్‌ల‌కు గ్లాస్ ఉంటే వాటిపై టింట్ వేయాలి. బ్లాక్ పెయింట్ కోటింగ్ వేయాలి.

2. చ‌లికాలంలో రూమ్‌లు మ‌రీ చ‌ల్ల‌గా కాకుండా ఉండాలంటే ఫ్లోర్‌పై కార్పెట్స్ వేసుకోవాలి. రూమ్ హీట‌ర్‌ను త‌క్కువ‌గా వాడాలి. సూర్య కాంతి, కిర‌ణాలు ఎక్కువగా రూమ్‌లో ప‌డేలా చూసుకోవాలి. దీంతో ఉష్ణోగ్ర‌త పెరుగుతుంది. అంతేకాదు, సూర్య కిర‌ణాల వ‌ల్ల మ‌న ఆరోగ్యం కూడా బాగుంటుంది.

3. మీ వ‌ద్ద ఇంట్లో డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్ రెండూ ఉన్న‌ట్ట‌యితే వీలైనంత వ‌ర‌కు ల్యాప్‌టాప్ వాడ‌డం మంచిది. దీంతో క‌రెంటు ఆదా అవుతుంది. అయితే ల్యాప్‌టాప్ లేకుండా డెస్క్‌టాప్ వాడేవారు ఏం చేయాలంటే.. డెస్క్‌టాప్‌ను స్లీప్ మోడ్‌లో సెట్ చేసుకోవాలి. దీంతో ఎక్కువ సేపు వాడ‌క‌పోతే పీసీ స్లీప్ మోడ్‌లోకి వెళ్తుంది. తద్వారా విద్యుత్ ఎక్కువ‌గా ఖ‌ర్చు కాదు. దీంతోపాటు పీసీలో స్క్రీన్ సేవ‌ర్‌ను పెట్ట‌రాదు. ఇది స్లీప్ మోడ్‌ను అడ్డుకుంటుంది.

4. ఇండక్ష‌న్ స్ట‌వ్‌ల‌ను వాడేవారు స‌మ‌యం క‌న్నా రెండు నిమిషాల ముందే స్ట‌వ్‌ను ఆర్పేయ‌డం బెట‌ర్‌. ఎందుకంటే ఆ స‌మ‌యంలో ఉండే వేడితో పాత్ర‌ల్లో ఉండే ఆహారం ఉడికిపోతుంది. దీని వ‌ల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే రాగి పాత్ర‌ల‌ను కుకింగ్ కోసం వాడ‌డం బెట‌ర్‌. ఆహారం త్వ‌ర‌గా ఉడుకుతుంది. పైగా ఈ పాత్ర‌లలో వండిన ఆహారం తింటే మ‌న‌కు ఆరోగ్యం క‌లుగుతుంది కూడా. దీంతోపాటు ఆ పాత్ర‌ల‌కు మూత‌లు టైట్‌గా ఉండేలా చూసుకుంటే ఇంకా ఎక్కువ క‌రెంట్‌ను ఆదా చేయ‌వ‌చ్చు.

5. ఫ్రిజ్‌ను వాడేవారు దాని టెంప‌రేచ‌ర్‌ను ఎల్ల‌ప్పుడూ 4 నుంచి 5 డిగ్రీల మ‌ధ్య‌లో సెట్ చేసుకోవాలి. అదే డీప్ ఫ్రీజ్ వాడితే దాని టెంప‌రేచ‌ర్ -15 నుంచి -18 డిగ్రీల మ‌ధ్య సెట్ చేయాలి. దీంతో క‌రెంటు ఆదా అవుతుంది. ఇక ఫ్రిజ్ డోర్ల‌ను ఎల్ల‌ప్పుడూ క్లోజ్ చేసి ఉంచాలి. అవి లూజ్ ఉంటే రిపేర్ చేయించాలి. ఎందుకంటే ఫ్రిజ్ డోర్ల‌ను తెరచి ఉంచితే కంప్రెస‌ర్‌పై అధిక భారం ప‌డుతుంది. ఫ‌లితంగా ఫ్రిజ్‌లో టెంప‌రేచ‌ర్ స‌రిగ్గా ఉండ‌డం కోసం కరెంటు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతుంది.

6. ఐర‌న్ బాక్సులు వాడే వారు దాని టెంప‌రేచ‌ర్‌ను ఆటోమేటిక్ పెట్టుకోవాలి. బ‌ట్ట‌ల‌పై త‌క్కువ నీళ్లు చ‌ల్లాలి. బ‌ట్ట‌లు పొడిగా ఉన్న‌ప్పుడే ఐర‌న్ చేయాలి. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది.

7. సీలింగ్ ఫ్యాన్‌ల‌కు ఎల‌క్ట్రానిక్ రెగ్యులరేట‌ర్‌లు వాడితే క‌రెంటు ఎంతో ఆదా అవుతుంది. వీటిని ఎంత వీలైతే అంత కింద‌కు పెట్టుకోవ‌డం బెట‌ర్‌. ఇక ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అయితే బాగా ఎత్తులో పెట్టుకోవాలి.

8. వాషింగ్ మెషిన్‌ల‌ను రాత్రి 10 నుంచి ఉద‌యం 10 మ‌ధ్య‌లో వాడితే క‌రెంటు బాగా ఆదా అవుతుంది. అందులో డ్రైయ‌ర్‌ను వీలైనంత త‌క్కువ‌గా వాడాలి. నెల‌కోసారి దాన్ని క్లీన్ చేయాలి. అందులో ఒక పొడి ట‌వ‌ల్‌ను వేసి బ‌ట్ట‌ల‌ను డ్రై చేయాలి. ఇక చ‌ల్ల‌ని నీటితో వాషింగ్ మెషిన్‌లో బ‌ట్ట‌ల‌ను ఉతికితే చాలా వ‌ర‌కు క‌రెంటు ఆదా అవుతుంది.

9. ఫ్రిజ్‌లోంచి తీసిని చాలా చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను వెంట‌నే ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌పై పెట్టి వేడి చేయ‌రాదు. అలా చేస్తే క‌రెంటు అధికంగా ఖ‌ర్చ‌వుతుంది. క‌నుక కొంత సేపు ఆగాక ప‌దార్థాల‌ను వేడి చేసుకోవాలి.

10. లైట్స్ విష‌యానికి వ‌స్తే అలంక‌ర‌ణ లైట్స్ ఎక్కువ‌గా వాడ‌రాదు. నాచురల్ లైట్స్‌నే వాడాలి. రెగ్యుల‌ర్ బ‌ల్బుల క‌న్నా ఎల్ఈడీ బ‌ల్బుల‌ను వాడితే ప‌వ‌ర్ ఎక్కువ సేవ్ అవుతుంది.

11. మైక్రోవేవ్ ఓవెన్‌, టోస్ట‌ర్‌లు వాడితే చీటికి మాటికీ వాటిని ఓపెన్ చేసి ఆహారం వేడి అయిందా, కాలేదా అని చూడ‌రాదు. స‌మ‌యం క‌న్నా రెండు నిమిషాల ముందే వాటిని ఆఫ్ చేస్తే ఆ వేడిపై ప‌దార్థాలు కుక్ అవుతాయి. దీంతో ప‌వ‌ర్ ఆదా చేయ‌వ‌చ్చు.

12. మ‌సాలాలు లేదా ఏవైనా పొడులు ప‌ట్టుకోవాలంటే మిక్సీనే వాడండి. ఫుడ్ ప్రాసెస‌ర్‌లు వాడితే వాటిపై లోడ్ అధికంగా ప‌డి క‌రెంట్‌ను ఎక్కువ‌గా వాడుకుంటాయి.

13. గీజ‌ర్‌ను వాడేవారు ఉద‌యాన్నే ఆన్ చేసి నీటిని వేడి చేయాలి. ఉద‌యం 10 గంట‌ల త‌రువాత గీజ‌ర్‌ను వాడ‌రాదు. ఇక గీజ‌ర్ ఉష్ణోగ్ర‌త‌ను 16 నుంచి 50 డిగ్రీల మ‌ధ్య పెట్టుకోవాలి. గీజ‌ర్‌ను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచ‌రాదు.

14. ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టాక కొందరు స్విచ్ ఆన్ చేసి చార్జ‌ర్‌ను అలాగే ఉంచుతారు. అలా చేయ‌రాదు. చార్జ‌ర్‌ను తీసేసి స్విచాఫ్ చేయాలి.

పైన చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే మీ క‌రెంటు బిల్లు స‌గానికి స‌గం వ‌చ్చినా మీరు ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. అవును, వీటితో చాలా వ‌ర‌కు విద్యుత్‌ను ఆదా చేయ‌వ‌చ్చు. బిల్లుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top