జ‌లుబు, ముక్కు దిబ్బడ‌, దంతాల‌నొప్పి, వికారం స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే 10 ప‌వ‌ర్ ఫుల్ టిప్స్‌..!

ముక్కు దిబ్బ‌డ‌, మూత్రంలో మంట‌, దంతాల నొప్పి వ‌గైరా.. వ‌గైరా… అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఎవ‌రైనా ఏం చేస్తారు..? ఏముందీ ద‌గ్గ‌ర్లోని మెడిక‌ల్ షాపుకు వెళ్లి మందో, టానిక్కో కొనుక్కుని సొంతంగా వేసుకుంటారు. అందుకు డాక్ట‌ర్‌తో ప‌నేముంటుందీ, తెలిసిన మందేనాయే. అంతే క‌దా ఎవ‌రైనా చేసేది..! అది క‌రెక్టే. కానీ అలా మాటి మాటికీ చేశార‌నుకోండి, ఆ మందులు కొంత కాలానికి ప‌నిచేయ‌వు. అప్పుడు స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతుంది. మ‌రి అలా క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..? మ‌న‌కు అందుబాటులో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌నే మందులుగా వాడాలి. అవును, అవే మ‌న అనారోగ్యాల‌ను పోగొడ‌తాయి. ఇంత‌కీ ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఏయే ప‌దార్థాల‌ను ఔష‌ధాల‌ను వాడ‌వచ్చో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.

1. ముక్కు దిబ్బ‌డ‌గా ఉందా..? అయితే ఇలా చేయండి. మిరియాల పొడిలో ఒక సూదిని తిప్పితే దానికి ఆ పొడి అతుక్కుంటుంది. అప్పుడు ఆ సూదిని మంట‌పై కాల్చండి. దీంతో స‌న్న‌ని పొగ వ‌స్తుంది. ఆ పొగ‌ను పీలిస్తే చాలు, ముక్కు దిబ్బడ ఇట్టే పోతుంది.

2. మూత్రంలో మంట రావ‌డం స‌హ‌జ‌మే. వేస‌వి కాలంలో ఎక్కువ‌గా ఇలా జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఈ బాధ పోవాలంటే వ‌రుస‌గా 2, 3 క‌ప్పుల వేడి వేడి నీటిని తాగాలి. ఎంత వేడి అంటే కాఫీ, టీ తాగుతారు క‌దా, అలాంటి వేడితో నీటిని తాగితే ఫ‌లితం ఉంటుంది.

3. ఎక్కువ సేపు షూస్ వేసుకోవ‌డం వ‌ల్ల పాదాల నుంచి దుర్వాస‌న వ‌స్తూ అది పోకుండా ఉంటే అప్పుడు వోడ్కాలో ఒక శుభ్ర‌మైన గుడ్డ‌ను ముంచి దాంతో పాదాల‌ను తుడ‌వాలి. వాస‌న ఇట్టే పోతుంది.

4. దంతాలు, చిగుళ్లు నొప్పిగా ఉంటే రెండు, మూడు వెల్లుల్లి రెబ్బ‌ల్ని ఆ ప్రాంతంలో 8 నుంచి 10 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేసిన‌ట్టు రాయాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శమ‌నం ల‌భిస్తుంది.

5. బ‌స్సులు, రైళ్లు, కార్లు ఇలా… కొంత మందికి ఆయా వాహ‌నాల్లో ప్ర‌యాణం చేసిన‌ప్పుడు మోష‌న్ సిక్‌నెస్ క‌లుగుతుంది. అంటే వాంతులు ఎక్కువ‌గా అవుతాయి. వికారంగా కూడా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఆలివ్ కాయ‌ల‌ను తీసుకెళ్లాలి. ఆ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఆలివ్ కాయ‌ను బుగ్గ‌న పెట్టుకోవాలి. దీంతో వాంతులు, వికారం త‌గ్గుతాయి.

6. కంటి రెప్ప‌లు ఉబ్బి వాపుకు గురై ఎర్ర‌గా ఉంటే అప్పుడు మ‌ల్లె పువ్వుల‌ను వాటిపై కొంత సేపు ఉంచాలి. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

7. జ‌లుబు బాగా ఉంటే నారింజ పండు తొక్క దాన్ని పోగొడుతుంది. ఎలా అంటే నారింజ పండు తొక్క‌ను స‌న్నని రోల్స్‌లా చేసి ముక్కులో పెట్టుకోవాలి. దీంతో జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

8. గాయాలు, దెబ్బ‌లు వంటి వాటికి డ‌క్ట్ టేప్ చుడితే త్వ‌ర‌గా అవి మానుతాయి.

9. నోటి నుంచి దుర్వాస‌న ఎక్కువ‌గా వ‌స్తుందా..? అయితే రోజూ పెరుగును తినాలి. దీంతో నోటి దుర్వాస‌న పోతుంది.

10. పురుగులు, కీట‌కాలు కుడితే ఆలుగ‌డ్డ‌ను కొంచెం క‌ట్ చేసి దాన్ని ఆ ప్ర‌దేశంపై ఉంచి మెడిక‌ల్ టేప్‌తో క‌ట్టు క‌ట్టాలి. 12 గంట‌ల‌కు ఒక‌సారి ఆలుగ‌డ్డ ముక్క‌ను మార్చాలి. ఇలా చేస్తే స‌మ‌స్య వెంట‌నే త‌గ్గుతుంది.

Comments

comments

Share this post

scroll to top