ఫ్లైట్ లో అదే ప‌నిగా గ్యాస్ వ‌దులుతున్నాడ‌ని…ఫ్లైట్ ని ఎమ‌ర్జ‌న్సీ ల్యాండ్ చేసిన పైలెట్.!!?

విమానంలో ప్ర‌యాణిస్తున్న ఓ వ్య‌క్తి అదే ప‌నిగా భరించ‌లేని వాస‌న‌తో కూడిన‌ గ్యాస్ ను వ‌దులుతున్నాడ‌నే కార‌ణంతో ప్ర‌యాణికుల మ‌ద్య స్టార్ట్ అయిన ఓ చిన్న గొడ‌వ విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసే వ‌ర‌కు వెళ్లింది.

వివ‌రాల్లోకెళితే..
దుబాయి నుండి అమ్ స్ట‌ర్ డ్యామ్ కు వెళుతున్న విమానంలో ఓ వ్య‌క్తి ప్ర‌యాణిస్తున్నాడు. అత‌డు తిన్న ఫుడ్ కార‌ణంగా కాస్త స్ట‌మ‌క్ అప్ సెట్ అయ్యి..అదే ప‌నిగా గ్యాస్ వ‌దులుతూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో అత‌ని ప‌క్క‌నే కూర్చున్న మ‌రో న‌లుగురు ప్ర‌యాణికులు ఇదే విష‌య‌మై అత‌నితో గొడవ ప‌డ్డారు. స‌ర్థి చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పటికీ అత‌డి మీద చెయ్యి చేసుకున్నారు. ఈ విష‌యం పైలెట్ కు తెలియ‌డంతో …అత‌ను ఫ్లైట్ ను వెంట‌నే వియ‌త్నాలో ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ చేశాడు.

ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంట‌నే పోలీసులు…గ్యాస్ వ‌దిలిన వ్య‌క్తిపై దాడి చేసిన 4 గురిని అరెస్ట్ చేశారు. గ్యాస్ వ‌ద‌ల‌డం స‌హ‌జ ప్రక్రియ దానిని త‌ప్పు బ‌డుతూ కొట్ట‌డం అనేది నేర‌మే అవుతుంద‌నేది పోలీసుల‌ వాద‌న‌…. త‌మ‌ను అన్యాయంగా అరెస్ట్ చేశార‌ని స‌ద‌రు ఎయిర్ లైన్స్ మీదే కేసు వేశారు ఆ 4 గురు ప్ర‌యాణికులు… నా వ‌ల్ల జ‌రిగిన త‌ప్పుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను, కానీ నేను కావాల‌ని అలా చేయ‌లేదు…నేను తిన్న ఫుడ్ కాస్త తేడా కొట్ట‌డంతో గ్యాస్ దానంత‌ట అదే బ‌య‌టికి త‌న్నుకొచ్చింద‌ని చెబుతున్నాడు ఫ్లైట్ లో గ్యాస్ వ‌దిలిన వ్య‌క్తి.

Comments

comments

Share this post

scroll to top