ఫ్లిప్ కార్ట్ లో 41 వేల రూపాయల “కెమెరా” ఆర్డర్ చేస్తే..అతనికి ఏ పార్సెల్ డెలివర్ అయ్యిందో తెలుసా..?

చిన్న పిన్నీసు దగ్గరనుండి పెద్దా కలర్ టీవి వరకు అన్ని ఆన్లైన్లో దొరుకుతూనే ఉన్నాయి.. ఆఖరికి పచ్చగడ్డి,ఎండుపిడకలు కూడా…..అదే ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే ముందుగా ఒక ప్లాన్ అనుకుని,కొనే వస్తువుని బట్టి ఫ్యామిలి అందరం వెళ్లాలా..కొనుక్కునే వాళ్లు వెళ్తే చాలా అని డిసైడ్ చేసుకుని,ఆ వస్తువు ఎక్కడ కొనాలి,అక్కడికి ఎలా వెళ్లాలి..అక్కడ కొంటే బాగుంటుందా లేదా అని మనవాళ్లేవరైనా అంతకు ముందు అక్కడ  ఏమన్నా వస్తువులు కొన్నారా అని మంచి చెడు కనుక్కుని పెద్ద తతంగమే నడిచేది…

బిజీ లైఫ్ లో టైం లేక కొందరు,ఓపిక లేక మరికొందరు ఆన్లైన్ షాపింగ్ ని ఇష్టపడుతుంటారు..కానీ ఆన్లైన్ మోసాలు ఇన్నీ అన్నీ కావు..మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరోకటి వస్తుంది.నాగోల్ మమతా నగర్‌కాలనీకి చెందిన  వినయ్(24)  డీఎస్‌ఎల్‌ ఆర్‌ కెమెరా కోసం  ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు.  రూ.41 వేల విలువైన కెనాన్‌ ఈవోఎస్‌ 700డి కెమెరాను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు.   తీరా  సెప్టెంబర్‌ 5వ తేదీ  సాయంత్రం డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్  విప్పి  చూస్తే  అందులో రాయి, బొమ్మ కెమెరాలు దర్శనమిచ్చాయి. ఇప్పటికే అలాంటి ఘటనలు బోలెడు చూసాం.చీరల బదులు నాసిరకం బట్టలు,మోబైల్స్ ప్లేస్ లో మ్యాంగోలు వస్తే ఇప్పుడు రాళ్లు కస్టమర్లను బిత్తరపోయేలా చేశాయి.

చేతిలో ఫోన్ ఉంటే చకచక యాప్  ఓపెన్ చేసి టక టక ఆర్డర్ బుక్ చేసే ముందు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది..చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా ,ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మిన్న..

Comments

comments

Share this post

scroll to top