ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు కొంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! ఎందుకంటే ఒక‌సారి కొన్నాక వాటిని మార్చ‌డం కుద‌ర‌దు..!

దేశీయ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జ సంస్థ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్‌లో ఏవైనా ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు కొంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! ఎందుకంటే ఆ సంస్థ రిట‌ర్న్ పాల‌సీని మార్చింది. దాని ప్ర‌కారం ఇక‌పై మీరు ఆ సైట్‌లో మొబైల్ ఫోన్స్‌, టాబ్లెట్స్‌, కంప్యూట‌ర్లు వంటి ఏ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువును కొన్నా ఒక వేళ అవి న‌చ్చ‌క లేదా ప‌నిచేయ‌క మీరు వాటిని మార్చేస్తామంటే కుద‌ర‌దు. మిగ‌తా ఏ వ‌స్తువునైనా కొన్న 10 రోజుల్లోపల మార్చుకునే వీలును ఫ్లిప్ కార్ట్ క‌ల్పించ‌గా, కేవ‌లం ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌కు మాత్రం రిట‌ర్న్ పాల‌సీని మార్చింది.

ఫ్లిప్‌కార్ట్ ప్ర‌వేశ‌పెట్టిన కొత్త రిట‌ర్న్ పాల‌సీ ప్ర‌కారం… పైన చెప్పిన విధంగా ఏవైనా ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను మీరు మారుస్తామంటే అది కుద‌ర‌దు. మొద‌ట ఫ్లిప్‌కార్ట్ త‌న త‌ర‌ఫు నుంచి ఆ స‌మ‌స్య‌ను సాల్వ్ చేసేందుకు టెక్నిక‌ల్ ప‌ర్స‌న్‌ను పంపుతుంది. అప్పుడు స‌మ‌స్య తీరిపోతే ఓకే. లేదంటే ఆ వస్తువును ఇక‌పై మీరు క‌స్ట‌మ‌ర్ కేర్ లేదా స‌ద‌రు సంస్థ స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి మార్చుకోవాల్సిందే. అక్క‌డ మార్చుకోవడానికి వీలు లేక‌పోతే రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ అలాంటి వ‌స్తువుల‌ను ఇక‌పై ఫ్లిప్ కార్ట్ రీప్లేస్ చేయ‌బోవ‌డం లేదు.

గ‌తంలో అమెజాన్ సంస్థ కూడా ఇలాగే ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల పట్ల రిట‌ర్న్ పాల‌సీని మార్చింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా అదే కోవ‌లో ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో ఫ్లిప్‌కార్ట్ వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని కోల్పోతుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అవును మ‌రి, ఏ కంపెనీకైనా వినియోగ‌దారుడే కింగ్‌లాంటి వాడు. అత‌న్ని కోల్పోతే రాజ్యం లాంటి లాభాన్ని కోల్పోయిన‌ట్టే. ఏది ఏమైనా, మీరు ఆన్‌లైన్‌లో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను గ‌న‌క కొంటున్న‌ట్ట‌యితే ఎందుకైనా మంచిది, ఓసారి ఆలోచించి మ‌రీ కొనుక్కోండి. ఎందుకంటే మీరు కొన్న ప్రోడ‌క్ట్‌లో లోపం ఉంటే ఇక ఆ త‌రువాత దాన్ని మారుద్దామంటే న‌ర‌క యాత‌న అనుభ‌వించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top