రన్‌వే పై నుంచి జారిపోయి సముద్రం వైపుకు దూసుకెళ్లిన విమానం.. తరువాత ఏం జరిగిందో తెలుసా..?

నిజంగా అదృష్టం అంటూ ఉంటే… ప్రతి రోజూ ప్రతి నిమిషం మనదే అవుతుంది. కానీ అదృష్టం లేకపోతే తాడే పామై కరుస్తుంది. అదృష్టం ఉన్నప్పుడు మనకు ప్రమాదాలు జరగవు. జరిగినా వెంట్రుక వాసిలో మన ప్రాణాలు రక్షింపబడతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆ ఎయిర్‌పోర్టులో జరిగింది. మరికొంత సేపట్లో విమానం టేకాఫ్‌ అవుతుంది అనుకుంటుండగా అదే సమయంలో ఆ విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న సముద్రం వైపు దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ సముద్రం ఒడ్డున విమానం ఆగడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. టర్కీలోని అంకారా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.

టర్కీ రాజధాని అంకారాలోని ట్రాబ్జాన్‌ ఎయిర్‌పోర్టు లో ఉన్న బోయింగ్‌ 737-800 విమానం టేకాఫ్‌ కు రెడీ అయింది. పైలట్‌లు విమానాన్ని టేకాఫ్‌ చేయించేందుకు ముందుకు నడిపించారు. అయితే రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో విమానం రన్‌వేపై జారిపోయింది. దీంతో విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న నల్ల సముద్రం వైపు దూసుకెళ్లింది.

అలా విమానం సముద్రం వైపునకు వెళ్తుండడంతో పైలట్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. మరో వైపు విమానంలో ఉన్న 162 మంది ప్రయాణికులు ఇక తమ ప్రాణాలు పోవడం ఖాయమని ఊపిరి ఉగ్గబట్టుకుని చూస్తున్నారు. అయితే సముద్రం వైపునకు దూసుకెళ్తున్న విమానం రన్‌ నుంచి కిందకు దిగగానే అక్కడే ఉన్న ఇసుకలో కూరుకుపోయింది. విమానం టైర్లు ఇసుకలో కూరుకుపోయాయి. దీంతో విమానం అక్కడే ఆగింది. అది చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే విమానం దగ్గరకు చేరుకున్నారు. విమానంలో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను ముందుగా జాగ్రత్తగా బయటకు తీశారు. తరువాత విమానంలో ఉన్న మిగిలి ప్రయాణికులను, సిబ్బందిని బయటకు దింపి విమానాన్ని పైకి లాగారు. అనంతరం దాన్ని ఎయిర్‌ పోర్టులోకి తరలించి రిపేర్‌ చేశారు. అయితే విమానం అలా ఇసుక ఆగడంతో తమ ప్రాణాలు దక్కాయని ప్రయాణికులు, సిబ్బంది చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు ఎవరికీ జరగకూడదు. వారి అదృష్టమే వారి ప్రాణాలను కాపాడింది. అయితే ఈ ఘటన తాలూకు ఫోటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

Comments

comments

Share this post

scroll to top