విడుదలైన ఫితూర్ ట్రైలర్….. ట్రైలర్ లో మంచి ఆర్ట్ ఉంది బాసూ.

ఆర్టిస్ట్ అయిన నూర్, బేగం ఫ్యామిలీకి చెందిన ఫిర్దాస్ ను  ప్రేమిస్తాడు. ఆమెకు ఇష్టమైన ప్రతి వస్తువును పెయింటింగ్ రూపంలో బంధిస్తుంటాడు. నూర్, ఫిర్దాస్ కు ఒకరంటే ఒకరికి ఇష్టం.. ఫిర్దాస్ కుటుంబానికి వీరి ప్రేమ అంటే ఇష్టం ఉండదు. ఈ కథాంశంతో అందమైన ప్రేమ కావ్యంగా, అందులో కాశ్మీర్ తీవ్రవాదం నేఫధ్యంతో అభిషేక్ కపూర్ డైరెక్షన్ లో తెరెకెక్కిన చిత్రం ‘ఫితూర్’. ప్రముఖ నవలా రచయిత చార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్’ నవల లండన్ బ్యాక్ డ్రాప్ ను, కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు అభిషేక్ కపూర్. ఆదిత్యరాయ్ కపూర్, కత్రినాకైఫ్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీలో టబు కీలకపాత్ర పోషిస్తోంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే విజువల్స్, బాంబ్ బ్లాస్ట్స్ ను చాలా చక్కగా చూపించాడు కెమెరామెన్ అనయ్ గోస్వామి. అమిత్ త్రివేది నేఫధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఆదిత్య, కత్రినా ల మధ్య వచ్చే లవ్, రొమాంటిక్ సీన్స్ లతో అలరించేందుకు సిద్ధమయ్యారు.సిద్దార్థ్ రాయ్ కపూర్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై నెటిజన్స్ ను అలరిస్తోంది. ఫిబ్రవరి 12న ఈ సినిమా విడుదలకానుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top