మ‌గ‌చేప రెండేళ్ల త‌ర్వాత ఆడ‌చేప‌గా మారుతుంద‌న్న విషయం మీకు తెలుసా? అసలు కథేంటంటే.?

ఓ చేప పుట్ట‌క‌తో మ‌గ‌చేప‌గా పుట్టి రెండేళ్ల త‌ర్వాత ఆడ‌చేప‌గా మార్పు చెందుతుంది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. పండుగ‌ప్ప ( బ‌ర్ర‌మండి) అనే చేప ఈ విధంగా మ‌గ నుండి ఆడ‌గా రూపాంత‌రం చెందుతుంది. దీనికి గ‌ల అస‌లైన కార‌ణాన్ని ఇంత‌వ‌ర‌కు సైంటిస్టులు క‌నుక్కోలేక‌పోయారు. అదేవిధంగా ప్యారెట్ ఫిష్ ఆడ నుండి మ‌గ గా మారుతుంది.

పండుగ‌ప్ప విష‌యానికి వ‌స్తే…. చాలా పండుగ‌ప్ప‌లు (90శాతం) జ‌న్మ‌త‌: మ‌గవిగానే పుడ‌తాయి… రెండేళ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు శుక్ర‌క‌ణాలు ఉత్ప‌త్తి చేస్తూ త‌మ సంతానోబివృద్ధికి పాటుప‌డుతుంటాయి. రెండేళ్లు పూర్తి కాగానే..శుక్ర‌క‌ణాల‌కు బ‌దులుగా అండాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం స్టార్ట్ చేస్తాయి.!

ఇలా చేయ‌డం వ‌ల్ల క‌లిగే మేలు:
చేప‌లు ఎక్కువ‌గా ఆడ‌విగా మార‌డం వ‌ల్ల అధిక సంతానోత్ప‌త్తి అవుతుంది. దీని వ‌ల్ల మాన‌వాళికి అధిక చేప‌లు ల‌భిస్తాయి. పండుగ‌ప్ప‌ల రుచి కూడా చాలా బాగుంటుంది. గోవా, బెంగాల్ లో పండుగ‌ప్ప‌ల‌ను పాన్ ప్రై చేసి ఓ ర‌క‌మైన మ‌సాలాల‌తో ధ‌ట్టించి రుచిక‌ర రెసిపీను అందిస్తారు.

Comments

comments

Share this post

scroll to top