దూరదర్శన్‌ టీవీలో మొదటి సారిగా కలర్‌లో ప్రసారమైన వీడియో ఇదే తెలుసా..?

అబ్బో… ఇప్పుడంటే ఎల్‌ఈడీలు.. స్మార్ట్‌ టీవీలు.. 4కె టీవీలు.. ఆండ్రాయిడ్‌ టీవీలు వచ్చాయి.. కానీ ఒకప్పుడు.. జనాలకు బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీలే దిక్కు. ఇక ఇప్పట్లో ఉన్నట్లుగా అప్పుడు టీవీ చానల్స్‌ లేవు. దీంతో కేవలం దూరదర్శన్‌లో మాత్రమే ప్రసారాలను చూసేవారు. శుక్రవారం పాటలు, ఆదివారం సినిమా, రోజూ రాత్రి వార్తలు.. అప్పుడప్పుడు క్రికెట్‌ మ్యాచులు.. అంతే.. టీవీల్లో ఒకప్పుడు వచ్చిన ప్రోగ్రామ్‌లు అవే. వాటినే బ్లాక్‌ వైట్‌ తెరల్లో చూసి ఆనందించేవారు. అయితే టీవీలు వచ్చాక చాలా కాలం వరకు వాటిల్లో కలర్‌ టీవీలు రాలేదు. అవి వచ్చాక కూడా కొంత కాలం బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోనే జనాలు టీవీ ప్రసారాలను చూశారు. తరువాత నెమ్మదిగా కలర్‌ లో ప్రసారాలు ప్రారంభం అయ్యాయి.

ఇక దూరదర్శన్‌ విషయానికి వస్తే 1959 సెప్టెంబర్‌ 15వ తేదీన మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఇన్‌ ఇండియా ఆధ్వర్యంలో దూరదర్శన్‌ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అది కూడా డీడీ అప్పట్లో ఆలిండియా రేడియోలో ఒక భాగంగా ఉండేది. తరువాత సొంత సంస్థగా డీడీ ఏర్పడింది. ఈ క్రమంలోనే డీడీలో మొదట్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే టీవీ ప్రసారాలు వచ్చేవి. ఆ తరువాత 1982 ఏప్రిల్‌ 25వ తేదీన మొదటి సారిగా దూరదర్శన్‌లో కలర్‌లో ప్రసారాలు ప్రారంభం అయ్యాయి.

దూరదర్శన్‌లో కలర్‌ లో ప్రసారాలు ఆరంభం అయినప్పుడు మొదటిసారిగా టెలికాస్ట్‌ అయింది.. డీడీ ట్యూన్‌.. రింగులు రింగులుగా వచ్చి డీడీ లోగో ఏర్పడుతుంది. అదే మొదటిసారిగా కలర్‌లో ప్రసారమైంది. తరువాతే డీడీలో కలర్‌ ప్రసారాలు ఆరంభం అయ్యాయి. ఈ క్రమంలో ఆ ట్యూన్‌ ప్రసారమై ఇప్పటికి 36 ఏళ్లు దాటింది. దీంతో ఆ ట్యూన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ట్విట్టర్‌లో చాలా మంది ఒకప్పటి డీడీ కలర్‌ ట్యూన్‌ను షేర్‌ చేస్తున్నారు. కావాలంటే మీరు దాన్ని చూడవచ్చు. మొదటి సారిగా డీడీలో కలర్‌లో ప్రసారమైన వీడియో అది..!

 

Comments

comments

Share this post

scroll to top