ఆమె సినిమాల్లో త‌న న‌ట‌న‌తో మెప్పించ‌డ‌మే కాదు, ఎమ్మెల్యేగా మొద‌టిసారి ఎన్నికై అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది…!

రాజ‌కీయ నాయ‌కుల‌న్నాక ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. కొంద‌రు ఒక‌సారి గెలిస్తే మ‌రోసారి ఓడిపోతారు. ఒక్కోసారి వ‌రుస‌గా గెలుస్తారు. మ‌రోసారి ఓడిపోతూనే ఉంటారు. కానీ కొంత మంది నాయకులు మాత్రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎంతో సుదీర్ఘ కాలం వ‌ర‌కు గెలుస్తూనే ఉంటారు. అయితే అలా గెలుస్తున్న నాయ‌కున్ని మొద‌టిసారి పోటీ చేస్తున్న ప్ర‌త్య‌ర్థి ఓడిస్తే? ఎలా ఉంటుంది? ఎలా ఉండ‌డ‌మేమిటి? అంత‌కు మించిన ఆశ్చ‌ర్యం, వింత మ‌రొక‌టి ఉండ‌దు. అందులోనూ అలా గెలిచిన ప్ర‌త్య‌ర్థి ఒక మ‌హిళ అయితే? ఆమె ఫిలిం స్టార్ అయితే? ఇక ఆ వింత, ఆశ్చ‌ర్యం రెట్టింపు అవ‌క మాన‌దు. అస్సాంలో ఇటీవ‌ల గెలిచిన ఓ మ‌హిళా ఎమ్మెల్యే కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఆమే ‘అంగూర్‌ల‌తా దేకా’ (Angoorlata Deka).

Angoorlata-Deka

అంగూర్‌ల‌తా దేకాది అస్సాం రాష్ట్రం. ఆమె న‌ల్బ‌రి అనే ప్రాంతంలోని ఓ గ్రామంలో జ‌న్మించింది. మోడ‌ల్‌గా ఆరంభ‌మైన ఆమె కెరీర్ న‌ట‌న‌తో ముందుకు సాగింది. ప‌లు బెంగాలీ, అస్సామీ సినిమాల్లో ఆమె న‌టించింది. ‘అమీ అక్సోమియా, జోండా ఇమాన్ గుండా, బ‌కోర్ పుతేక్’ వంటి ప‌లు చిత్రాల ద్వారా ఆమె బాగా పాపుల‌ర్ అయింది. ‘సోనార్ ఖారు నెలాగే మోకె’ అనే చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఆమె విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుంది. అంతేకాదు అంగూర్ ప‌లు వీడియో ఆల్బంల‌లోనూ న‌టించింది.

2015 డిసెంబ‌ర్ 15న మారిగావ్ అనే ప్రాంతంలో జ‌రిగిన ఓ కార్య‌క్రమంలో అంగూర్ బీజేపీ పార్టీలో చేరింది. ఈ క్ర‌మంలో ఆమెకు ఆ పార్టీ త‌ర‌ఫున బాటాద్రోబా నియోజ‌క‌వర్గ ఎమ్మెల్యే ప‌ద‌వికి గాను టిక్కెట్ ల‌భించింది. దీంతో ఆమె ఇటీవల జ‌రిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించింది. కాగా ఆమె బాటాద్రోబా నియోజ‌క‌వర్గంలో గ‌త 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌స్తున్న కాంగ్రెస్ నాయ‌కుడు గౌతం బోరాను ఓడించి గెల‌వ‌డం ఓ విశేషం అయితే, పోటీ చేసిన మొద‌టి సారే గెల‌వ‌డం మ‌రో విశేషం. అంతేకాదు ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే ప‌ద‌వి కోసం బీజేపీ 6 మంది మ‌హిళ‌ల‌కు టిక్కెట్ ఇవ్వ‌గా అందులో కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే గెలుపొంద‌డం, ఆ ఇద్ద‌రిలో అంగూర్ కూడా ఒక‌రు కావ‌డం మ‌రో చెప్పుకోద‌గ్గ విశేషం. మోడ‌లింగ్‌, సినిమా, రాజ‌కీయాలు… ఇలా ఏ రంగంలోనూ వెన‌క్కి త‌గ్గ‌కుండా అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతున్న అంగూర్‌ల‌తా దేకాకు నిజంగా మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే క‌దా!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top